8th Pay Commission Updates in Telugu: ఉద్యోగులు ఎప్పట్నించో కోరుతున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలకడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందంతో ఉన్నారు. అయితే ఈ కొత్త వేతన సంఘం ఎప్పట్నించి అమల్లోకి వస్తుంది, ఏ రాష్ట్రంలో ముందుగా అమలు కానుందనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరువాత ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందనే సందేహాలు నెలకున్నాయి. ఆ వివరాలను పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వం నియమించే 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతం, పెన్షన్ పెరుగుతుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం 7వ వేతన సంఘం సిఫార్సులను కూడా వివిధ రాష్ట్రాలు వివిధ సమయాల్లో అమలు చేశాయి. అదే విధంగా ఇప్పుడు కూడా 8వ వేతన సంఘం సిఫార్సుల్ని రాష్ట్రాలు వేర్వేలు సమయాల్లో అమలు చేసే పరిస్థితి ఉంది. ఇంకా సులభంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు 8వ వేతన సంఘం ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి, వెసులుబాటును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, పెన్షన్లను సరిచేసేందుకు ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంటుంది. ఉద్యోగుల జీతభత్యాలు, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఏం చేయాలో కమీషన్ సూచిస్తుంటుంది.
సిఫార్సులు ఎలా అమలు చేస్తారు
కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఓ ప్రణాళిక అభివృద్ధి చేస్తుంది. తమ తమ ఆర్ధిక పరిస్థితిని బట్టి వివిధ వేతన విధానాలు ఎంచుకుంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం వేతనం నిర్ణయిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతభత్యాలు నిర్ణయిస్తుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగనుందా
ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. ఇప్పుడు దీనిని 2.86కు పెంచితే కనీస వేతనాన్ని 2.86తో గుణిస్తారు. దాంతో కనీస వేతనం భారీగా పెరుగుతుంది. అంటే దాదాపు మూడు రెట్లు అవుతుంది. ఇక ద్రవ్యోల్బణాన్ని బట్టి డీఏ పెరుగుతుంది. 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపుగా 20-25 శాతం పెరిగాయి.
ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా జీతాలు పెంచుతాయి
8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. వీటిని ఎలా అమలు చేయాలి, ఎప్పుడు అమలు చేయాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. గతంలో ఉన్న పరిస్థితి ప్రకారం జీడీపీ అధికంగా ఉండి, ఆర్ధికంగా బాగున్న రాష్ట్రాలు త్వరగా వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేస్తుంటాయి. గతంలో అంటే 7వ వేతన సంఘం అమలైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తరువాత ముందుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందుగా అమలు చేశాయి. 8వ వేతన సంఘం అమలైతే ముందుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అమలు చేసే అవకాశం కన్పిస్తోంది. దీనికి కారణం రెండు రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతాయి. గరిష్టంగా జీతాల పెంపు అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి ఉంటుంది. అయితే ఎప్పుడు, ఎంతనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి ఉంటుంది.
Also read: Cold Waves: గజగజ వణికిస్తున్న చలి, ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి