Cold Waves: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతోంది. గత రెండు మూడ్రోజులుగా చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దట్టమైన పొగమంచు కప్పేసి ఉంటోంది. రాత్రి వేళ మంచు ధారాళంగా కురుస్తోంది.
సాధారణంగా సంక్రాంతి నుంచి చలి తీవ్రత తగ్గుతుంటుంది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సంక్రాంతి దాటినా చలి మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రత పడిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో కూడా చలి తీవ్రత అధికంగా ఉంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలముకోవడంతో వాహనదారులకు ఇబ్బంది ఎదురౌతోంది. ఏజెన్సీ జిల్లాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు వచ్చేసింది. ఉదయం 10 -11 గంటల వరకూ పొగమంచు కప్పేసి ఉంటోంది.
అరకు లోయలో నిన్న అత్యల్పంగా 5.9 డిగ్రీలు నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చలి తీవ్రత కారణంగా అటు స్థానికులు, ఇటు పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 గంటల వరకూ వాహనాలు లైట్స్ ఆన్ చేసుకునే రాకపోకలు సాగిస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకే చలిగాలులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా చిన్నారులు, వృద్ధులు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది.
అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 12-15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక అదిలాబాద్, ఏటూరు నాగారం, మంచిర్యాల జిల్లాల్లో చలితీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పగటి ఉష్ణోగ్రత 8-10 డిగ్రీలకు పడిపోయింది. మరో 2-3 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా.
Also read: NEET UG 2025 Update: నీట్ పరీక్ష రాస్తున్నారా, అయితే ఈ పని త్వరగా పూర్తి చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి