TRAI New Rules for Mobile Users: టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా సిమ్ కార్డ్ రీఛార్జ్ విషయంలో కీలక అప్డేట్ ఇచ్చింది. ఏ సిమ్ కార్డు ఎన్ని రోజులు రీఛార్జ్ చేయకున్నా పనిచేస్తాయో తెలిపింది. ఈ నేపథ్యంలో రీఛార్జ్ చేసుకోబోయే యూజర్లకు ఇది మంచి అవకాశం. తరచూ సిమ్ కార్డులు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండదు. ఎన్ని రోజులు ఇన్ కమింగ్ కాలింగ్ అవుట్ గోయింగ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇక జియో వినియోగించే యూజర్లకు 90 రోజులపాటు రీఛార్జ్ చేయకుండా పనిచేస్తుంది. ఇక ఆ గడువు ముగిసేలోగా రియాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందులో ఒక నెల పాటు ఇన్కమింగ్ కాల్స్ రీఛార్జ్ చేయకుండా అందుకుంటారు. కొంతమంది యూజర్లకు ఒక వారం లేదా ఒక రోజు వాళ్ళు లాస్ట్ రీఛార్జ్ ఆప్షన్ పై ఆధారపడి ఉంటుంది.
అయితే ఈ 90 రోజుల్లో దాటిన తర్వాత కూడా జియో యూజర్లు సిమ్ కార్డ్ రీఛార్జ్ చేసుకోకపోతే ఆ నంబర్ పర్మినెంట్‌గా తొలగించి ఇతర కొత్త యూజర్లకు ఆ నంబర్ కేటాయిస్తారు. డీయాక్టివేట్ కాకుండా మీ నంబర్ మీకే ఉండాలి అంటే ఆ గడువు ముగిసేలోగా తక్షణమే రీఛార్జీ చేసుకోండి.
ఎయిర్టెల్ ఉపయోగించే యూజర్లు కూడా 90 రోజుల పాటు రీఛార్జ్ లేకుండా సిమ్ కార్డ్ యాక్టివ్గానే ఉంటుంది. ఎయిర్టెల్ యూజర్లు 15 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ పొందుతారు. ఈ గడువు కూడా పూర్తయిన తర్వాత రీఛార్జ్ చేసుకోకపోతే నంబర్‌ను పర్మినెంట్‌గా డిస్ కనెక్ట్ చేసే వేరే యూజర్లకు కేటాయిస్తారు.
వి యూజర్లు మాత్రం 90 రోజులపాటు గ్రేస్ పీరియడ్ పొందుతారు. రీఛార్జ్ చేసుకోకుండా సిమ్ యాక్టివ్గానే ఉంటుంది. అయితే వీళ్ళు కచ్చితంగా రూ.49 రూపాయల రీఛార్జి ప్లాన్ ఈ సమయంలో రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: చలి చంపేస్తోంది.. ఈ 2 రోజులు భద్రం, ఐఎండీ కీలక సూచన..!
ఇక ప్రభుత్వ రంగ కంపెనీ అయినా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఎక్కువ సమయం పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. మీరు సిమ్ రీఛార్జ్ చేసుకోకున్నా 180 రోజులపాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఇది తరచూ సిమ్ కార్డ్ రీఛార్జ్ చేసుకోలేని వారికి బంపర్ ఆఫర్. TRAI కల్పించిన ఈ వెసులుబాటు వల్ల తరచూ రీఛార్జ్ చేసుకోవాలనే వారికి ఊరట అందించింది. ముఖ్యంగా ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నవాళ్లు అన్ని సిమ్ కార్డులను తరచూ రీచార్జ్ చేసుకోలేరు.
కాబట్టి ఈ వెసులుబాటు వారికి భారీ ఊరట అందిస్తుంది. TRAI కాలర్ వెరిఫైడ్ నేమ్ రిసిపీయంట్ ఫోన్లో డిస్ప్లే ఇవ్వాలని సూచించింది. దానికి కాలర్ నేమ్ ప్రెజెంటేషన్(CNAP) అంటారు. సత్వరమే ఈ వెసులుబాటు అందుబాటులోకి రావాలని సూచించింది. దీంతో ఫేక్ కాల్స్ ని నివారించవచ్చు, యూజర్లకు భద్రత కల్పిస్తుంది.
ఇదీ చదవండి: గ్రీన్ శారీలో గత్తరులేపుతున్న స్రవంతి చొక్కరపు.. పైట కొంగు జరిపి సోకుల విందు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.