Amit Shah AP Tour: ఏపీలో అమిత్ షా బిజీ బిజీ.. పలు కేంద్ర సంస్థలను ప్రారంభించనున్న కేంద్ర హోం మినిష్టర్..

Amit Shah AP Tour: కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ విచ్చేసారు. గన్నవరం నుంచి నిన్న చంద్రబాబు ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ కు చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్, పురందేశ్వరితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యాు. ఈ పర్యటనలో   అమిత్‌ షా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 19, 2025, 10:15 AM IST
Amit Shah AP Tour: ఏపీలో అమిత్ షా బిజీ బిజీ.. పలు కేంద్ర సంస్థలను ప్రారంభించనున్న కేంద్ర హోం మినిష్టర్..

Amit Shah AP Tour: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ విచ్చేసారు. అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్వాగతం పలికారు. నిన్న చంద్రబాబు ఇంట్లో విందు కార్యక్రమం తర్వాత ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ క్యాంపస్‌లను అమిత్‌షా  ప్రారంభిస్తారు.  ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ , కేంద్ర మంత్రలు, తదితరులు పాల్గొననున్నరు.

ఉదయం  ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముచ్చటిస్తారు. అనంతరం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చేరుకుంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు పాల్గొంటారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

రెండురోజుల పర్యటన కోసం రాత్రి విజయవాడ చేరుకున్న  కేంద్ర మంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్వాగతం పలికారు. వీరితో పాటు   కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం అమిత్‌ షా సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నరు. అక్కడ ఆయనకు విందు ఏర్పాటు చేశారు. విందుకు డిప్యూటీ సీఎం  పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరయ్యారు.

విందు అనంతరం అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  సమావేశమ­య్యారు. వారు కొద్దిసేపు పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు కూటమి నేతలు తెలిపారు. విందులో కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివా­స­వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్‌ షా విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేశారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News