Big Shock To Govt Employees: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులకు ఊహించని షాక్ తగిలింది. నాటి సీఎం కేసీఆర్ రిటైర్మెంట్ వయసు పెంచగా.. దానిని తగ్గించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించాలని కోరుతూ ఆందోళనలు మొదలయ్యాయి. పదవీ విరమణ వయసును 58 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్‌తో తెలంగాణలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన బాట చేపట్టారు.
Also Read: Kishan Reddy: 'అలా అంటే చెంప చెళ్లుమనిపించండి'.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరుద్యోగుల జేఏసీ నిరసన చేపట్టింది. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 58 ఏళ్లకు తగ్గించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచిందని గుర్తుచేశారు.
Also Read: KPHB Colony: కేపీహెచ్‌బీ కాలనీకి భారీ గండం.. హౌసింగ్ బోర్డు స్థలాలు వేలానికి?
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును తగ్గించి పని భారం లేకుండా చూడాలని మోతీలాల్ నాయక్ కోరారు. పోలీస్ శాఖ వారికి ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 55 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసును తగ్గిస్తే ప్రతి యేటా 9,000 ఉద్యోగాలను అదనంగా భర్తీ చేయవచ్చని వివరించారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రంలో నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వయోపరిమితిని పెంచుకుంటూ పోతున్న కొద్ది ఉద్యోగస్తుల ఆరోగ్య సహకరించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఓయూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పదవీ విరమణ వయస్సు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు అందరిని ఏకం చేసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.