Duvvada Srinivas and divvela Madhuri visits Tirumala: తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ దర్శించుకున్నారు. ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం నేపథ్యంలో స్వామివారిని దర్శించుకొవడం ఆనందంగా ఉందన్నారు.గతంలో దువ్వాడ శ్రీనివాస్ , దివ్వెల మాధురీ తిరుమల మాడ వీధుల్లో ఫోటో షూట్ చేశారని.. టీటీడీ వీరిపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
తిరుమలలో కేసులు సైతం నమోదయ్యాయి. ఈ క్రమంలో దివ్వెల మాధురీ గతంలో.. పవన్ కళ్యాన్ పై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా మాత్రమే కేసులుపెట్టి ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీలు మాత్రం.. ఇప్పుడు మరోసారి తిరుమలో హల్ చల్ చేశారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో స్వామివారిని దర్శించుకొవడం ఆనందంగా ఉందన్నారు.
అంతే కాకుండా.. ప్రజలంతా మంచిగా ఉండాలని కోరుకున్నట్లు మాట్లాడారు. అదే విధంగా దివ్వెల మాధురినీ అక్కడి మీడియా ప్రతినిధులు మాట్లాడించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం.. ఈరోజు మౌనవ్రతం మాట్లాడనని చెప్పి.. నోరు విప్పి మాట్లాడి మరీ చెప్పింది.
Read more: Video Viral: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో... హనుమాన్ చాలీసా విని కదిలిన గర్భంలోని శిశువు..
దీంతొ మీడియావాళ్లు ఒకింత ఆశ్చర్యపోయారు. సాధారణంగా మౌనవ్రతం అంటే ఎవరితో కూడా మాట్లాడరు. అవసరం ఉంటే.. సైగలతో ఏదైన చెప్తారు. అలాంటిది .. మాట్లాడి మరీ మౌనవ్రతం అనడం ఏంటని షాక్ అయ్యారంట. మొత్తానికి దివ్వెల మాధురీ చేసిన పనితో మరోసారి ఈ జంట వార్తలలో నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter