IIT Baba at Mahakumbh Full Story: మహాకుంభమేళకు భక్తులు భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ సంగమానికి కోట్ల కొద్ది భక్తులు చేరుకొని పుణ్యస్నాలను ఆచరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక త్రివేణి త్రివేణి సంగమాలకు కూడా అదే మోతాదులో భక్తులు చేరుకొని నదీ స్నానాలను చేస్తున్నారు. ఈ కుంభమేళలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, అఘోరాలు భారీ ఎత్తున తరలివచ్చి నదీ స్నానమాచరిస్తున్నారు. అంతేకాకుండా కుంభమేళ సమయంలోనే చాలామంది సాధువులు ఆధునిక జీవనశైలికి బై బై చెప్పి.. ఆధ్యాత్మిక జీవితానికి వెల్కమ్ చెప్తున్నట్లు ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది సాధువుల్లో ఉన్న బాలురను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇదిలా ఉండగా ఓ ఐ టి బాబాకు సంబంధించిన వీడియో ఇటీవలే తెగ వైరల్ అవుతుంది. ఈ బాబా ఏకంగా ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి.. ఆధ్యాత్మిక జీవితానికి స్వాగతం పలికాడట. ఇటీవలే ఆయన ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్స్ ఆశ్చర్యపోయారు. ఈ బాబాకు సంబంధించిన వీడియోలు ఇంతలా వైరల్ అవ్వడానికి కారణాలేంటి.. ‘ఐఐటీయన్ బాబా’ అని పేరు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటో పూర్తి వివరాలి ఇప్పుడు తెలుసుకుందాం..
మహా కుంభమేళ లో భాగంగా అక్కడికి తరలివచ్చిన రకరకాల సాధువులు, బాబాలు, అఘోరీలు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతే కాదండోయ్.. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఆయన మీడియా ప్రతినిధి అడిగిన క్యూస్షన్స్ సమాధానమివ్వడం, అది కూడా హిందీ, ఇంగ్లీష్ లో బాబాలా మాట్లాడకుండా.. ఒక ప్రొఫెసర్ల ఎంతో చక్కగా మాట్లాడడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి తావిస్తోంది. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానాలు ఇస్తాడు.. తన పేరు అభయ్ సింగ్ అని.. గతంలో ఆయన బాంబే ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడని.. రిపోర్టర్ చెబుతాడు. అయితే ఈయనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ బాబా అనంత సోషల్ మీడియా వినియోగదారులంతా ఐఐటి బాబాగా పిలవడం ప్రారంభించారు.
ఈ బాబా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం నుంచి.. కుంభమేళాలోని తరలివచ్చిన భక్తులంతా ఇక ఫోటోలు దిగడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఐఐటి బాబా విపరీతంగా వైరల్ అవుతున్నాడు. ఇక అభయ్ సింగ్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... అభయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి. ప్రస్తుతం ఆయన సాంకేతిక జీవితానికి గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక జీవితానికి స్వాగతం పలికి ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే బాబాల మారడానికి ప్రధాన కారణాలేంటి అని ప్రశ్నిస్తే.. ఆ బాబా ఇలా స్పందించారు.." బాబా అనేది అత్యుత్తమ దశ అని.. "సమాధానం తెలిపారు. బాబా నాలుగు సంవత్సరాల పాటు ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా విద్యాభ్యాసం కొనసాగించారని.. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లో భాగంగా ఒక అత్యున్నత సంస్థలో ఉద్యోగం కూడా పొందారట.
ఆ తర్వాత ఈ బాబా కొన్నేళ్లపాటు ఒక పెద్ద కార్పోరేషన్లు జాబ్ కూడా చేసి.. ఆధ్యాత్మిక జీవితానికి వెల్కమ్ చెప్పేందుకు బాబాల మారారని ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా ఐఐటీలో చదివే క్రమంలోనే ఫిలాసఫీ వైపు మొగ్గు చూపే వారట.. ఇదే సమయంలో ఫిలాసఫీ కి సంబంధించిన అనేక కోర్సులు కూడా చదివినట్లు తెలిపారు. ఇక అప్పటినుంచి శివుడుని ఆరాధించడం కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. అప్పటినుంచి ఇప్పటివరకు శివుడిని ఆరాధిస్తూ బాబా లాగా మారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఐఐటి బాబా తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఐఐటి బాబా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ సైన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.