200 Rupee Note: నోట్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కట్టడి చేసినా నకిలీ కరెన్సీ బెడద ఉండనే ఉంటోంది. ఈ మధ్యకాలంలో 200 రూపాయల నకిలీ నోట్లు మార్కెట్‌లో పెద్దఎత్తున చలామణీలో ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. నకిలీ బెడద అధికమవడంతో 200 రూపాయల నోట్లను రద్దు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
డీ మోనిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు తరువాత 500, 200 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణీలో ఉంటున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు నకిలీ 200 రూపాయల నోట్లను చలామణీ చేస్తున్నారు. ఇదే నకిలీ బెడద, నల్లధనం అరికట్టేందుకు 9 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ నకిలీ బెడద పెరగడంతో 200 రూపాయల నోట్లను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రయత్నించినా నకిలీ నోట్ల బెడద అరికట్టలేకపోతోంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విస్తృతంగా నకిలీ నోట్లు తిరుగుతున్నాయి. ఇటీవలే తెలంగాణ, మహారాష్ట్రలో 200 రూపాయల నోట్లు కలర్ జిరాక్స్ చేసి చలామణీ చేస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. ముఖ్యంగా 2 వేల రూపాయల నోటు రద్దు చేసిన తరువాత నకిలీ 500, 200 రూపాయల నోట్లు పెరిగాయని ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది. అందుకే వీటిని రద్దు చేయనుందనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా జరుగుతోంది. అయితే ఆర్బీఐ ఈ విషయాన్ని ఖండించింది. 200 రూపాయల నోట్లను రద్దు చేయడం లేదని తెలిపింది. అదే సమయంలో నకిలీ 200 రూపాయల నోటును ఎలా గుర్తించాలో సూచించింది.
ఒరిజినల్ 200 రూపాయల నోటు ఎలా ఉంటుంది
ఒరిజినల్ 200 రూపాయల నోటుపై 200 అనేది దేవనాగరి లిపిలో ఉంటుంది. నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం స్పష్టంగా కన్పిస్తుంటుంది. నోట్‌పై ఆర్ బిఐ, భారత్, ఇండియా, 200 అనే అక్షరాలు సూక్ష్మంగా ఉంటాయి. 200 రూపాయల నోటుపై ఇండియా, ఆర్బీఐ అని రాసిన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. నోటుకు కుడివైపున అశోక స్థంభం ఉంటుంది. ఈ లక్షణాల్ని బట్టి నకిలీ ఏదో, అసలు ఏదో సునాయసంగా గుర్తించవచ్చంటోంది ఆర్బీఐ. నకిలీ నోట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.