CM Revanth Reddy: నేడు విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం..

Telangana CM Revanth Reddy Foreign Tour: నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి. అక్కడే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేతో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. అటు కేంద్ర మంత్రులను కలిసారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఈ రోజు ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 16, 2025, 09:27 AM IST
CM Revanth Reddy: నేడు విదేశీ పర్యటనకు  సీఎం రేవంత్ రెడ్డి..  తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం..

Telangana CM Revanth Reddy Foreign Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని  ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌.. ఇవాళ రాత్రి 10 గంటలకు సింగపూర్‌కు పయనమవుతారు. ఈ నెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజులపాటు అక్కడ గడపనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటైన క్రీడా విశ్వవిద్యాలయాలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. అంతేకాదు అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు.

అనంతరం ఈ నెల 20న స్విట్జర్లాండ్‌కు వెళ్లి.. అక్కడ నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. లాస్ట్ ఇయర్  తొలిసారి దావోస్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి  రూ. 40వేల 232 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు.

ఇందులో అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలున్నాయి. ఈసారి అంతకుమించి పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. విస్తరణలో భాగంగా ఇక్కడే మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఈసారి దావోస్‌లో ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈవోలతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

అలాగే.. భారత్‌లో పెట్టుబడులకు సిద్ధమవుతున్న విదేశీ కంపెనీలు తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంగా ఈసారి దావోస్‌ సమావేశంలో తెలంగాణ పెవిలియన్‌ పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి దావోస్‌ సమావేశాల్లో రూ. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. దావోస్‌ పర్యటన అనంతరం ఈ నెల 24న సీఎం హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News