Kumbha Mela: ఉత్తర్‌ప్రదేశ్ ఆద్యాత్మకంగా అందరి చూపు ఇక్కడ జరిగే కుంభమేళాపైనే ఉంది. అక్కడ ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రారంభమైన ‘మహా కుంభమేళా’కు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం మకర సంక్రాంతి పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర ప్రదేశ్ సర్కార్ వెల్లడించింది.
కుంభమేళాలో 144 యేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా సమయంలో చేసే పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానముంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే ఒంటినిండా విభూది పూసుకుని ఈటెలు, త్రిశూలాలు చేతపట్టుకుని వచ్చారు. డమరుక నాదాల నడుమ వేలమంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్నానాలకు తరలి రావడంతో పాటు గడ్డకట్టే చలిలో పుణ్య స్నానాలు పవిత్రంగా ఆచరించారు. తొలుత పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శంభు పంచాయతీ అటల్ అఖాడాకు చెందిన సాధువులు స్నానమాచరించారు. మహా కుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. మరోవైపు.. హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించింది అక్కడ ప్రభుత్వం.
*
కుంభమేళాలో పాల్గొనడం కోసం ప్రయాగ్ రాజ్ వస్తున్న యాత్రికుల కోసం ప్రభుత్వమే కాకుండా, నదీ తీరాల్లో ప్రైవేటుగా కూడా పెద్ద ఎత్తున వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ వసతి సదుపాయాల అద్దె మాత్రం భారీగానే ఉంది. ఒక లగ్జరీ టెంట్ కు ఒక రాత్రికి సుమారు లక్ష వరకు అద్దె ఉంది. అవి కాకుండా, నగరంలోని హోటళ్లలో ఒక రాత్రి రూమ్ రెంట్ సుమారు 20,000 వరకు ఉంది. అయితే, ఐఆర్సీటీసీ టెంట్ సిటీ లో మాత్రం సరసమైన ధరలకే వసతి లభిస్తోంది. ఇక్కడ రేట్లు రాత్రి వసతికి 1,500 నుండి ప్రారంభమవుతాయి.
ప్రయాగ్ రాజ్ క్యాంప్ సైట్ లో దాదాపు 40 లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసింది. మహా కుంభ మేళాలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఇది మూడోసారి. ఈ టెంట్లలో సూట్ బాత్రూంలు, వేడి మరియు చల్లని నీరు, ఆన్-సైట్ రెస్టారెంట్ ఉన్నాయి. ఈ క్యాంప్ సైట్ లో వసతి ఒక రాత్రికి 70,000 నుండి లక్ష వరకు ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు, హెచ్ఎన్ఐలు, సిఇఒలు, ఎన్ఆర్ఐలతో కూడిన ఎంపిక చేసిన సమూహానికి సేవలు అందిస్తున్నాయి.
మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన సాధువులు, భక్తులకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలియజేసారు. అదే విధంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంది యూపీ సర్కారు యంత్రాంగం. మహా కుంభమేళా ఏర్పాట్లపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పెదవి విరిచారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు. తాగునీరు, ఆహారం, వసతి వంటి కనీస సౌకర్యాల కోసం భక్తులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.