Aadhar Card Photo Update: ఆధార్ కార్డు మన దేశంలో ఏ లావాదేవీలు చేయాలన్నా తప్పనిసరి. స్కూల్లో అడ్మిషన్ నుంచి ప్రతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ అర్హత పొందాలన్నా ఈ ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డు పై ఉన్న ఫోటో ఎన్ని రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పదేళ్లు పైబడిన ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకొని వెసులుబాటు కల్పించింది. వీడికి ఇంకా సమయం ఉంది. ఇటీవలె ఆధార్ అప్డేట్ గడువును పెంచిన సంగతి తెలిసిందే.
ఇక ఆధార్ కార్డు పై ఫోటోను ఎన్నేళ్ళకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. లేకపోతే ఆధార్ కార్డు పనిచేయదా? ఆ పూర్తి నియమాలు తెలుసుకుందాం. అయితే యుఐడిఏ ప్రకారం ఆధార్ కార్డు పై ఫోటోను మార్చుకోవటం వ్యక్తిగత అభిప్రాయం.
అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మన ముఖ కవలికలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఆధార్ కార్డు పై ఫోటోను మార్చుకోవాల్సి ఉంటుంది.. ఇంకా చిన్నపిల్లలకు ఐదేళ్లలోపు ఇచ్చే ఆధార్ కార్డును 15 ఏళ్ల తర్వాత ఎలాగో బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆధార్ కార్డు ఫోటోను కూడా అప్డేట్ చేసుకోవాలి.
ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. యుఐడిఐ ఈ వెసులుబాటు కల్పిస్తుంది. అయితే ఫోటోకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి ముందుగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఫోటో అప్డేట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని మాత్రమే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోగలరు.
మిగతా ఏ పని చేయాలన్న తప్పనిసరిగా ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే. అక్కడ మీ పాత ఫోటోను లేదా పదేళ్లు పాతబడిన ఫోటోలను ఇతర వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఫోన్ నెంబర్, అడ్రస్ వంటివి సులభంగా మార్చుకోవచ్చు. ఇంట్లో సులభం ఈజీగా ఈ పని పూర్తి చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.