Abhimani Movie: అభిమాని మూవీ కోసం రంగంలోకి మణిశర్మ.. త్వరలోనే థియేటర్స్‌లో సందడి

Abhimani Movie Updates: సురేష్‌ కొండేటి అభిమాని మూవీ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రంగంలోకి దిగారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ అందించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. తాజాగా రీరికార్డింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 14, 2025, 11:06 PM IST
Abhimani Movie: అభిమాని మూవీ కోసం రంగంలోకి మణిశర్మ.. త్వరలోనే థియేటర్స్‌లో సందడి

Abhimani Movie Updates: ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో రాంబాబు దోమకొండ డైరెక్షన్‌లో రూపొందుతన్న మూవీ అభిమాని. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్‌ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ అందిస్తుండగా.. తాజాగా ఈ సినిమా కోసం మెలొడీ బ్రహ్మ మణిశర్మ రంగంలోకి దిగారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ కంప్లీట్ అయింది. ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. తాజాగా మకర సంక్రాంతి సందర్భంగా విషెస్ తెలిపారు.
 
ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ.. అభిమాని మూవీ మంచి కంటెంట్‌తో వస్తోందని.. సోషల్ మెసేజ్ గొప్పగా ఉంటుందన్నారు. అంతే గొప్పగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కుదిరిందని తెలిపారు. ఈ మూవీలోని పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందన్నారు. సురేష్‌ కొండేటి చాలా బాగా నటించారని.. ఆయన యాక్టింగ్‌ ఆకట్టుకుంటుందన్నారు. దర్శకుడు రాంబాబు దోమకొండ తాను అనుకున్న పాయింట్‌ పర్ఫెక్ట్‌గా తెరకెక్కించారని మెచ్చుకున్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు.

దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ.. అభిమాని చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మణిశర్మ అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. బ్యాక్ గ్రౌండ్  స్కోర్ అద్భుతంగా ఇచ్చారని.. రీ రికార్డింగ్ వర్క్ పూర్తయిందన్నారు. తాను అనుకున్న దానికంటే మూవీ ఇంకా చాలా బాగా వచ్చిందన్నారు. చివరి 20 నిమిషాలు సినిమాకు కీలకం అని.. మణిశర్మ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశారని అన్నారు. సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటించగా.. యముడిగా అజయ్ ఘోష్ నటించారని తెలిపారు. నానమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ, చిత్రగుప్తుని పాత్రలో ఎస్.కె రెహమాన్, హీరోయిన్‌గా అక్సాఖాన్, ఆమెకు జతగా యువ కథాయకుడు జై క్రిష్ నటించారని వెల్లడించారు. తన మీద ఎంతో నమ్మకంతో ప్రధాన పాత్ర చేయడానికి ఒప్పుకున్న సురేష్ కొండేటికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. వచ్చే నెలలో థియేటర్లలో తీసుకువస్తామని చెప్పారు.

 సురేష్ కొండేటి మాట్లాడుతూ.. తాను ప్రధాన పాత్ర పోషించిన సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశ‌ర్మ‌  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని.. ఈ సంక్రాంతిని తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. మణిశర్మ అనేది పేరు కాదని.. ఓ బ్రాండ్ అని అన్నారు. ఆయన సంగీతం వల్లే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయని గుర్తు చేశారు. తెలుగు సినిమాల ప్రస్తావనలో సంగీతం గురించి వచ్చినప్పుడు కచ్చితంగా మణిశర్మ గుర్తుకు వస్తారని.. తాను యంగ్‌గా ఉన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని అన్నారు. నటుడిగా తాను మరో స్థాయికి చేరుకోవడానికి ఈ మూవీ దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Mahakumbh Mela: 'మకర సంక్రాంతి' మహాకుంభమేళా..ఎటు చూసినా జనకోలాహలం..ఆకాశంనుండి చూస్తే ఇలా వుంటుంది  

Also Read: Nitya Menen: మరో వివాదంలో నిత్యా మీనన్.. ఏకంగా దేవుడిపైన వివాదస్పద వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News