Double Murder: సంక్రాంతి పండుగ నాడు సంచలనం.. పద్మనాభ స్వామి గుట్టల్లో జంట హత్యలు

Double Murder Creates High Tension In Puppalaguda: యువతి, యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. పండుగ పూట జంట హత్యలు కలకలం సృష్టించాయి. హత్యపై పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 14, 2025, 05:03 PM IST
Double Murder: సంక్రాంతి పండుగ నాడు సంచలనం.. పద్మనాభ స్వామి గుట్టల్లో జంట హత్యలు

Puppalaguda Double Murder: సంక్రాంతి పండుగ పూట హైదరాబాద్‌లో జంట హత్యలు సంచలనం రేపాయి. హైదరాబాద్‌ శివారులోని పుప్పాలగూడలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఈ సంఘటనతో  ఏం జరిగిందోననే ఉత్కంఠ నెలకొంది. ఓ యువకుడిని.. యువతిని హత్య చేసిన సంఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలో భయానక పరిస్థితి ఏర్పడింది.

Also Read: Liquor Price Dwon: ఏపీ ప్రజలకు 'సంక్రాంతి కిక్కు'.. భారీగా మద్యం ధరలు తగ్గుముఖం

హైదరాబాద్‌లోని నార్సింగి పుప్పాలగూడలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టలు ఉన్నాయి. అక్కడ మృతదేహాలు కనిపించడంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడకు చేరి పరిశీలించగా రెండు మృతదేహాలు కనిపించాయి. యువకుడిని కత్తులతో‌ పొడిచి మొఖంపై బండరాయితో ఒక దాడి చేసి హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఆ సమీపంలోనే 60 మీటర్ల దూరంలో యువతి మృతదేహం కూడా ఉంది. యువతి మొఖంపై కూడా బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు కనిపిస్తోంది.

జంటను గుర్తు పట్టరాకుండా ముఖాలపై బండరాళ్లతో‌ దాడి చేసి హత్య చేసినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో భారీగా మద్యం సీసాలు గుర్తించారు. క్లూస్ టీమ్ అక్కడ కీలకమైన ఆధారాలు సేకరించారు. రెండు రోజుల కిందట హత్య జరిగినట్లు పోలీసులు  అనుమానిస్తున్నారు. కాగా హత్యకు గురయిన వారి వివరాలు ఇంకా లభించలేదు. యువతి శరీరంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు గురైన జంట వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని.. త్వరలోనే కేసును ఛేదిస్తామని ప్రకటించారు. కేసు నమోదైన అనంతరం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటన హైదరాబాద్‌లో పండుగ పూట సంచలనం సృష్టించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News