TTD Decisions: భూలోక వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని.. ఆలయ సేవలు మరింత విస్తృతం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. టీటీడీ ఆలయాలు, ఆస్తుల అంతర్జాతీయంగా విస్తరించేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ బోర్డు ఆమోద ముద్ర వేసింది.
Also Read: Dil Raju: సంధ్య థియేటర్ బాధిత రేవతి భర్తకు దిల్ రాజు బంపర్ ఆఫర్.. సినిమా ఛాన్స్
తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, అధికారులు కొన్ని గంటల పాటు చర్చలు చేశారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ వెల్లడించింది. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవల కోసం జాతీయ హోదా గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం స్విమ్స్‌కు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందని సమావేశంలో చర్చ జరిగింది.
Also Read: Kadapa Mayor: మళ్లీ మేయర్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే మధ్య రచ్చరచ్చ.. 'కడప'లో కుర్చీల లొల్లి
టీటీడీ నిర్ణయాలు ఇవే..
- కాలినడక దారుల్లో భక్తులకు వైద్యం అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యధిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం.
- భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్‌బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఏపీ డిజిటల్ కార్పోరేషన్ సహకారంతో భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం.
- తిరుమలలోని బిగ్, జనతా క్యాంటీన్ నిర్వహణకు దేశంలో ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం.
- తిరుమల అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఎస్‌ఎల్‌ఎస్‌ఎంపీసీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం
- కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి ఏడాదికి రూ.2 కోట్లు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం.
- ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ పోస్టును ఎస్‌ఎల్‌ఎస్‌ఎంపీసీ కార్పొరేషన్ ద్వారా భర్తీకి నిర్ణయం.
- సర్వ దర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో రూ.3.36 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణానికి ఆమోదం.
- ఒంటి మిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి అక్కడి సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook