ముంబై: భారత క్రికెట్ సీనియర్ ఆటగాడు, పేసర్ ఇషాంత్ శర్మ భారత్ న్యూజిల్యాండ్ ల మధ్య ఈ నెల 29న జరగబోయే రెండో టెస్టు మ్యాచ్ కు దూరం కానున్నాడా.. అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. వెల్లింగ్టన్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో 22.2 ఓవర్లలో 5/68 గణాంకాలతో అత్యుత్తమంగా నిలిచిన ఇషాంత్ శర్మ కుడి చీలమండలో నొప్పి కారణంగా శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ కు హాజరు కాకపోవడంతో భారత జట్టుపై భారం పడనుందా అనే అందోళన మొదలైంది.
ఇషాంత్ శర్మ చీలమండ గాయంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడని జట్టు ఫీజియో తెలపగా, గాయానికి సంబంధించి స్కాన్ తో పాటు తదితర పరీక్షలు నిర్వహించారని కాగా, నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఇషాంత్ శర్మ అనర్హుడని తేలితే, అప్పుడు ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీలలో ఎవరో ఒకరు ఆ స్థానంలో ఆడతారని తెలిపారు. టెస్టుల్లో 45 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్నందున ఉమేష్ యాదవ్ ఎంపికయ్యే అవకాశాలున్నాయని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..