AP Investments: తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. హైడ్రాపై తప్పుడు ప్రచారం తప్ప ఏమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ తరలివెళ్లడం లేదని.. అక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. అమరావతిలో వరదలు రావడంతో పెట్టుబడులు అక్కడకు వెళ్లడం లేదని.. హైదరాబాద్-బెంగళూరుకు వెళ్తున్నాయని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సందర్భంగా పలు అంశాలపై చిట్‌చాట్ చేశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, పెట్టుబడుల అంశంపై ఆయన మాట్లాడారు. 'హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు. చంద్రబాబు రాగానే అక్కడికి పోతుంది అనేది ప్రచారం మాత్రమే' అని కొట్టిపారేశారు. అమరావతిలో వరద వల్ల ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అమరావతిలో వరద వల్ల పెట్టుబడులు పెట్టే వాళ్లకు భయం పట్టిందని చెప్పారు.
Also Read: BRS Party: బీఏసీ అంటే బిస్కట్ చాయ్ సమావేశం కాదు.. బీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరణ
'ఆ భయంతో హైదరాబాద్ - బెంగుళూరుకు పెట్టుబడిదారులు వస్తున్నారు' అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. 'హైడ్రా భయం ప్రజల్లో మాత్రం లేదు. మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసింది' అని పేర్కొన్నారు. అప్పులపై కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ రుణాలతో కలిపి మొత్తం లెక్కలు బీఆర్‌ఎస్ పార్టీ బయటపెట్టాలని సవాల్ విసిరారు.
తెలంగాణ అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయి. శాసనసభలో ఎవరి పాత్ర వారిదే. ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కు' అని పొంగులేటి తెలిపారు. 'కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడే కోరిక నాకు వ్యక్తిగతంగా ఉంది' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదు అని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter