Mohan babu reaction on false allegations: మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదం రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం.. మనోజ్ ఇటీవల జల్ పల్లిలోని తన నివాసంలోకి గేట్లు బద్దలు కొట్టుకుని రావడం, ఆ తర్వాత మోహన్ బాబు అక్కడికి చేరుకొవడం, ఆయన ఒక రిపోర్టర్ పై మైక్ లాక్కుని దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిపోర్టర్ కు ఫ్యాక్చర్ జరిగి.. సర్జరీ జరిగినట్లు తెలుస్తొంది. అయితే.. ఈ ఘటనను అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండిచాయి. తెలంగాణ సర్కారు కూడా దీనిపై సీరియస్ అయ్యింది.
పోలీసులు మోహన్ బాబును తమ ఎదుట హజరు కావాలని, ఆయన దగ్గరున్న వెపన్స్ ను సైతం స్వాధీనంచేసుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు.. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అదే విధంగా పోలీసులు ఆయనపై మర్డర్ అటెంప్ట్ కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తొంది. ఆయన తన వ్యక్తిగత వైద్యుల ఆధ్వర్యంలో.. ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తొంది.
False propaganda is being circulated.! Anticipatory bail has NOT been rejected and currently. I am under medical care in my home. I request the media to get the facts right.
— Mohan Babu M (@themohanbabu) December 14, 2024
కానీ కొన్ని మీడియాలు, సోషల్ మీడియాలో మోహన్ బాబు కన్పించడంలేదని, ఆయకు కోర్టులో బెయిల్ తిరస్కరణకు గురయ్యిందని అందుకే ఆయన ఎక్కడికో సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా, మంచు మోహన్ బాబు స్పందించారు. ఎక్స్ వేదికగా ట్విట్ పెట్టి తాను ఇంట్లోనే ఉన్నానని, దయచేసి ఇలాంటి ఫెక్ రూమర్స్ వ్యాప్తి చేయోద్దని కూడా కోరినట్లు తెలుస్తొంది.
Read more: వ్యాఖ్యలు చేసిన నయనతార..!.. ఏంజరిగిందంటే..?
ఈ వార్తలను ఖండిస్తున్నట్లు కూడా మోహన్ బాబు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టినట్లు సమాచారం. మరొవైపు మోహన్ బాబుఇప్పటికే బాధితకుటుంబానికి సారీచెప్పినట్లు తెలుస్తొంది. దీనిపై పోలీసులు ఏవిధంగా ముందుకు వెళ్తారో మాత్రం తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.