EX CM Jagan: వాటిని శెనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు: చంద్రబాబుపై జగన్ ధ్వజం

YS Jagan Mohan Reddy on Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ప్రతి నెలా ఓ అంశాన్ని పట్టుకొస్తన్నారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా వచ్చిందన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 11, 2024, 01:52 PM IST
EX CM Jagan: వాటిని శెనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు: చంద్రబాబుపై జగన్ ధ్వజం

YS Jagan Mohan Reddy on Chandrababu Naidu: అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పట్ల కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు, గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతినెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం వ్యవహారంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

"అసలు అధికారంలో ఎవరున్నారు అని సందేహం వస్తోంది..? రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలు అయ్యింది. మంత్రులు వాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్ల. అటు కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరిమీద నిందలు వేస్తారు..? ఎవరిమీద దుష్ప్రచారం చేస్తారు..? ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారు. కానీ ఆ షిప్‌ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదు.

బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్‌. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు..? అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ దీన్ని ఇప్పుడు ట్విస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన ప్రభుత్వం హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే, దాన్ని పక్కనపెట్టాం. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించాం. సన్నరకం తినగలిగే బియ్యాన్ని అందించాం. సార్టెక్స్‌ చేసిన మరీ ఇచ్చాం.

రేషన్‌ బియ్యం దుర్వినియోగానికి పుల్‌స్టాప్‌ పెట్టింది మనమే.. కానీ మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారు. సార్టెక్స్‌ బియ్యాన్ని ఇవ్వడం లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడం లేదు. దీనివల్ల మళ్లీ రేషన్‌ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి. ఆర్బీకే వ్యవస్థ నీరుగారిపోయింది. రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. 

చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైంది. కరెంటు బిల్లులు చూస్తే షాక్‌లు జరుగుతున్నాయి. రూ.15 వేల కోట్లకుపైగా ఛార్జీలు పెంచాడు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్స్‌లు వేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సంపద సృష్టి అంటే.. బాదుడే బాదుడు. రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల. దాన్ని కట్టింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. దాదాపుగా పూర్తైంది, షిప్‌లు కూడా వచ్చే పరిస్థితి. ఐదేళ్లలో నాలుగు పోర్టులు కట్టడం మొదలైంది. ఇప్పుడు వాటిని శెనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు.

మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టించాం. వీటిని పద్దతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడు. వెలిగొండ రెండు టన్నెల్స్‌ పూర్తిచేసాం. ఆర్‌ అండ్‌ అర్‌ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మనం అధికారంలో ఉండి ఉంటే అక్టోబరులో నీళ్లు నింపేవాళ్లం. అయిపోయిన ఈ ప్రాజెక్టును ఆర్‌ అండ్‌ ఆర్‌ కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. మార్కాపురంలో మనం మెడికల్‌ కాలేజీని దాదాపుగా పూర్తిచేశాం. ఇప్పుడు దీన్నికూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే మనం అంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే.

ఈ నెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం.. కరెంటు ఛార్జీలపైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం. అలాగే పీజు రీఎయింబర్స్‌మెంట్‌కోసం జనవరి 3న కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడంలేదు. ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. ప్రతిరోజూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.." అని వైఎస్ జగన్ అన్నారు. 

Also Read: Manchu Vishnu: తండ్రిగా ఆయన తపన చూడండి.. మా నాన్న కోపంతోనే అలా చేశారు: మంచు విష్ణు  

Also Read: Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో ట్విస్ట్, 10 లక్షల సూట్‌కేసుతో అవినాష్ అవుట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News