Manchu Vishnu Comments on Controversy: మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదం నేపథ్యంలో మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చారు. తాను ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదన్నారు. మూడు తరాలుగా తమ కుటుంబం మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉన్నామన్నారు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయని.. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతామన్నారు. తనకు ఇది చాలా పెయిన్ ఫుల్ అని.. తామెంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అని అన్నారు. "మీడియాకి విజ్ఞప్తి.. మీకు కుటుంబాలు ఉన్నాయి.. మీకు తండ్రులు ఉన్నారు.. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. సెన్సేషన్ ఎందుకు అవుతుందో తెలియడం లేదు.. కేవలం మేము సెలబ్రిటీస్ కావడం వల్ల ఇలా చేస్తున్నారా..??
మా అమ్మకి ఇవాళ ఆరోగ్యం బాగోలేదు. మా నాన్న నిన్నటి ఇష్యూలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నేను కన్నప్ప షూటింగ్లో ఉన్నాను. గొడవల వల్ల నేను షూటింగ్ ఆపుకుని వచ్చేశాను. ఫస్ట్ కుటుంబం ముఖ్యం అనుకున్నాను. నిన్న ఒక జర్నలిస్టుకి గాయాలు అయ్యాయి. చాలా దురదృష్టకరం. దానికి చింతిస్తున్నాము. నిన్న తండ్రిగా ఆయన తపన చూడండి.. దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయనకి లోగో మొహం మీద పెట్టారనే కోపంతో అలా చేశారు. అలా జరిగి ఉండకూడదు." అని మంచు విష్ణు అన్నారు.
తమకు నోటీసులు రాకముందు పోలీసులు మీడియాకి విడుదల చేశారని.. అది ఎలా సాధ్యం అవుతుంది..? అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఉదయం గన్ సబ్మిట్ చేయాలని చెప్పారని.. మీడియాలో నిన్న విడుదల చేశారని అని అన్నారు. ఈ రోజు 9.30 గంటలకు నోటీసు ఇచ్చి పదిన్నర కి హాజరు కావాలని అంటే ఎలా..? అని అడిగారు.
Also Read: EX CM Jagan: వాటిని శెనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు: చంద్రబాబుపై జగన్ ధ్వజం
Also Read: Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో ట్విస్ట్, 10 లక్షల సూట్‌కేసుతో అవినాష్ అవుట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.