Manchu Manoj: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచు కుటుంబానికి భారీ పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరు.. అటు రాజకీయాలలో కూడా మంచి పేరు దక్కించుకున్నారు. దీనికి తోడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈయన దుబాయ్ లో ఉండగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు గొడవపడ్డారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మంచు మోహన్ బాబు టీం ఖండించినా.. మనోజ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడంతో అందరూ నిజమే అని నిర్ధారణకు వచ్చారు.
దీనికి తోడు మనోజ్ తన తండ్రి తరఫు.. పదిమంది వ్యక్తులు తనపై తన భార్య, ఏడు నెలల కూతురుపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తన కుటుంబ వ్యక్తులపై ఎవరిపై కూడా ఈయన కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ మోహన్ బాబు మాత్రం తన కొడుకు మంచు మనోజ్, కోడలు భూమా మౌనిక నుంచి ముప్పు పొంచి ఉందని, తనకు ప్రాణహాని ఉందని వారి నుంచి తనను కాపాడాలని కూడా మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
ఇకపోతే ఇదంతా ఇలా ఉండగా మరొకవైపు.. మోహన్ బాబు ఇంటికి మనోజ్ తరఫున 30 మంది బౌన్సర్లు రాగా.. మంచు విష్ణు తరుపున ఏకంగా 40 మంది బౌన్సర్లు వచ్చారు. ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారని మనోజ్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
తాజాగా మంచు మనోజ్ తాను ఆస్తి కోసం, డబ్బు కోసం పోరాటం చేయలేదని , ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. తనను రక్షించడానికి వచ్చిన బౌన్సర్లను పోలీసులు పంపించారని , ఎదుటి వాళ్ళ కోసం వచ్చిన బౌన్సర్లను పోలీసులు ఎందుకు పంపించలేదో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య, తన ఏడు నెలల పాపను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారని ఆయన ఆరోపణలు చేశారు.
తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను అడిగాను. అన్ని విధాల సహాయంగా ఉంటామని చెప్పిన వారే, ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే నేను పోరాటం చేస్తున్నాను. న్యాయం కోసం ప్రతి ఒక్కరిని కలుస్తాను అంటూ ఆయన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.