Andhra pradeh highcourt issued anticipatory bail to rgv: కాంట్రవర్సీలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. గతంలో ఆయన తీసిన వ్యూహాం అనే సినిమాను తీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఆయన సతీమణిలను కించపర్చే విధంగా పోస్టులను పెట్టారని ఇటీవల ఏపీలో పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు అందాయి.
ఈ క్రమంలో పోలీసులు కేసుల్ని నమోదు చేసి.. విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ మాత్రం.. పోలీసులకు చిక్కకుండా.. తనకు టైమ్ కావాలని, సినిమాల్లో బిజీగా ఉన్నానని రిక్వెస్ట్ లెటర్ సైతం పంపించారు. మరోవైపు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు మాత్రం. కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తొంది.
ఆర్జీవీపై నమోదైన కేసులపై ముందస్తు బెయిల్ ఇస్తు.. ఏపీ హైకోర్టు తాజాగా, ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తొంది. అయితే.. అప్పుడెప్పుడో తాను మాట్లాడిన మాటలపై.. వారు స్పందించకుండా.. మరేవరో స్పందించి ఫిర్యాదులు చేయడం ఏంటని ఆర్జీవీ ఫైర్ అయ్యారు. దీని వెనకాల ఎవరో ఉన్నారని మండిపడ్డారు. అంతేకాకుండా.. తాను ఆన్ లైన్ లో పోలీసుల ఎదుట హజరవుతానని చెప్పారు.
పోలీసులు హైదరాబాద్ కు రావడంఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా మండిపడ్డారు. ఈ క్రమంలో ఆర్జీవీకి మాత్రంమూడు కేసుల్లో.. ముందస్తు బెయిల్ ఇస్తు ఏపీ హైకొర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఉపశమనం లభించిందని చెప్పుకొవచ్చు. మరికొందరు ఆర్జీవీపైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని.. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కారని కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.