Pushpa 2 Business: 2 తెలుగు రాష్ట్రాలలో పుష్ప -2 కి భారీ టార్గెట్.. ఎంత రాబట్టాలంటే..?

Pushpa 2 Break Even: అల్లు అర్జున్,  సుకుమార్, రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Nov 30, 2024, 03:20 PM IST
Pushpa 2 Business: 2 తెలుగు రాష్ట్రాలలో పుష్ప -2 కి భారీ టార్గెట్.. ఎంత రాబట్టాలంటే..?

Pushpa 2 Pre Release Business : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప -2. భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఐదవ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక అందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నవంబర్ 17వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన లభించింది. అంతేకాదు ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఈ పాట కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. 

ఇదిలా ఉండగా ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రూ.22 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో పుష్ప -2  సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.  విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో బాక్సాఫీస్ కలెక్షన్లు,  టికెట్ రేట్లు వంటి వాటి గురించి కూడా నెటిజన్స్ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ కలిపి దాదాపు రూ.1060 కోట్లు వసూలు చేసిందని సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.225 కోట్ల షేర్ అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో జీఎస్టీ,  థియేటర్ రెంట్ ఇతర ఖర్చులు అదనం.

ఇక అల్లు అర్జున్ కెరియర్ లో ఇది భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా రూ.398 కోట్ల గ్రాస్, రూ.239.3 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే బాహుబలి 2 రూ.303.8 కోట్ల గ్రాస్, రూ .205.1 కోట్ల షేర్ అందుకుంది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898AD సినిమా రూ.284.1 కోట్ల గ్రాస్, రూ .161.2 కోట్ల షేర్ రాబట్టింది.  

ఇక ఈ సినిమాలన్నీ కూడా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ఒకవేళ పుష్ప -2 గనుక బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేస్తే ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటుంది.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News