న్యూఢిల్లీ: జియో ఫీచర్ ఫోన్ యూజర్స్‌కి 'ఆల్ ఇన్ వన్' ప్లాన్ పేరిట రిలయన్స్ జియో సంస్థ గుడ్ న్యూస్ వినిపించింది. 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తమ కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే 25 రెట్లు అధిక విలువను అందించే విధంగా నాలుగు సరికొత్త టారిఫ్‌లను ప్రవేశపెడుతున్నట్టు జియో ప్రకటించింది. రూ.75-రూ.185 మధ్య వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 28 రోజుల కాలపరిమితితో వివిధ టారిఫ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అందులో మొదటిది రూ.75 ప్లాన్‌తో జియో నుంచి జియో నెట్‌వర్క్‌కు అపరమిత కాల్స్, జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు 500 నిమిషాల ఉచిత కాల్స్, 50 ఎస్ఎంఎస్లు, నెలకు 3జీబీ డేటా లభిస్తుందని జియో తమ ప్రకటనలో పేర్కొంది. రెండోది రూ.125 ప్లాన్‌తో నెలకు 14జీబీ డేటా, 500 నాన్-జియో నిమిషాలు, 300 ఎస్ఎంఎస్లు, మూడవ టారిఫ్ రూ.155 ప్లాన్‌లో నెలకు 28 జీబీ, 500 నాన్ జియో మినిట్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభించనున్నాయి. చివరిదైన నాలుగవ టారిఫ్ రూ.185 ప్లాన్‌తో నెలకు 56 జీబీ డేటా, 500 నాన్-జియో మినిట్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభించనున్నాయి.