Viral Video: వైరల్‌ వీడియో.. వెయిటర్‌ జాబ్‌ కోసం పెద్ద క్యూ కట్టారు.. నిరుద్యోగం ఇంతలా ఉందా?

Waiter job viral video: ఉద్యోగం కోసం అప్పుడప్పుడు సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు మెగా జాబ్‌ మేళాలు నిర్వహించినప్పుడు ఆఫీసులపై బయట బారులు తీరిన అభ్యర్థులను చూసే ఉంటాం. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కు ఉన్న డిమాండ్‌ కూడా అలాంటిది. అయితే, ఓ వైరల్ వీడియోలో కేవలం వెయిటర్‌ జాబ్‌ కోసం వేలల్లో బారులు తీరారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా హల్‌చల్‌ చేస్తోంది.

Written by - Renuka Godugu | Last Updated : Oct 6, 2024, 06:10 PM IST
Viral Video: వైరల్‌ వీడియో.. వెయిటర్‌ జాబ్‌ కోసం పెద్ద క్యూ కట్టారు.. నిరుద్యోగం ఇంతలా ఉందా?

Waiter job viral video: సాధారణంగా జాబ్‌ మేళాలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు బారులు తీరడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, నేటి వైరల్‌ వీడియోలో మాత్రం కేవలం వెయిటర్‌ జాబ్‌ కోసం వేలల్లో బారులు తీరారు.సారీ కేవలం అనకూడదు. ఇతర దేశాల నుంచి చదువు, జాబ్‌ నిమిత్తం వచ్చిన పౌరులు కెనడాలో కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌ బయట దాదాపు 3000 మంది వరకు వెయిటర్ జాబ్‌ కోసం పెద్ద క్యూ కట్టారు. ముఖ్యంగా ఈ వైరల్ వీడియోలో అత్యధిక శాతం మన భారతీయ విద్యార్థులే కనిపించడం గమనార్హం. 

కెనడాలో 'తందూరీ ఫ్లేమ్‌' అనే రెస్టారెంట్‌ జాబ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. వెయిటర్‌ జాబ్‌ కోసం సదరు రెస్టారెంట్‌ జాబ్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇలామపెద్ద సంఖ్యలో మన భారతీయ నిరుద్యోగులు, విద్యార్థులు బారులు తీరారు. ఈ వైరల్‌ వీడియోని 'మెఘ అప్డేట్స్' అనే ఎక్స్‌ పేజీలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింటా బాగా వైరల్‌ అవుతుంది.

ఓ విద్యార్థి అయితే, వచ్చి గంటలు అయింది ఆన్‌లైన్‌ రెస్యూమ్‌ పెట్టా. నేరుగా ఇంటర్వ్యూకు రమ్మని పిలిచారు. కానీ, ఇక్కడ చూస్తే ఇంత మంది జనం వచ్చారు. జాబ్‌ వస్తుందో లేదో నమ్మకం లేదు అని వాపోయాడు. మరో విద్యార్థి ఎవ్వరికీ ఇక్కడ సరైన జాబులు లేవు, మా స్నేహితులు గత రెండేళ్లుగా జాబ్‌ వెతుకుతున్నారు. కానీ, వారికి ఇప్పటికీ సరైన జాబే లేదు అని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఇద్దరే కాదు ఇక్కడున్న చాలా మంది నిరుద్యోగులు, విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టి భారత్‌లో అప్పులు చేసి మరీ విద్య, ఉద్యోగం కోసం వెళ్తారు. ఇంజినీరింగ్ చదివిన వారు కూడా సరైన ఉద్యోగం పొందడం కోసం ఏదో ఒక జాబ్‌లో చేరతారు. 

ఇదీ చదవండి: పండుగ ముందు జియో బిగ్ అప్‌గ్రేడ్‌.. రూ.1,029 రీఛార్జీ ప్లాన్‌తో ఇక అమెజాన్ ప్రైమ్‌ లైట్‌ ఉచితం..  

అక్కడ కూడా గట్టి పోటీ వచ్చే సరికి ఏ చేయని దుస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు కూడా ఏదో జాబ్‌ చేస్తూ సెమిస్టర్‌ ఫీజులు చెల్లించాలని అనుకుంటారు. పూట కూడా గడవాలి. తల్లిదండ్రుల వద్ద అప్పు చేయకుండా ఇలా విదేశాల్లో అయితే, గంటలపై పనిచేస్తూ డబ్బు సంపాదించవచ్చని వస్తారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చదువుకు సరిపోయే ఉద్యోగం పక్కనబెడితే, ఏ ఉద్యోగమైన ఫర్వాలేదు అని సిద్ధపడినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సాధించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి:  బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ కారు యాక్సిడెంట్.. తుక్కుతుక్కయిన కారు.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఈ వీడియో చూసి నెటిజెన్లు కూడా సోషల్‌ మీడియాలో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. హాయిగా కెనడా వెళ్లి పాలు తాగుతూ బతకచ్చు అనుకునేవారికి ఈ వీడియో చెంపపెట్టు అని ఒకరు. మరొకరు ఈ వీడియో చూస్తే హృదయవిదారకంగా ఉంది. విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవడానికి కెనడా వెళ్తారు. కానీ వారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా? అని కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News