జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు విచారణ

ఆర్టికల్ 370రద్దుపై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

Last Updated : Sep 29, 2019, 09:52 AM IST
జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అక్టోబర్ 1 నుంచి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీం కోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ అన్నింటిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రకటించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్.. తాజాగా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

సుప్రీం కోర్టు వెల్లడించిన వివరాల మేరకు.. ఆర్టికల్ 370రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లపై ఎన్‌వీ. రమణ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 1 నుంచి వాదనలు విననుంది. న్యాయమూర్తులు ఎస్‌కే. కౌల్, ఆర్. సుభాష్, బీఆర్. గవాయ్, సుర్యకాంత్ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

Trending News