Root Canal and Heart: మనిషి శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అలాంటిదే పళ్లు. పళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. అందుకే చిన్నతనం నుంచే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినవద్దని సూచిస్తుంటారు. పంటి సమస్యలు ఏదైనా తలెత్తితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ తప్పనిసరిగా మారింది.
అయితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ ఎంత వరకు సేఫ్ అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఎందుకంటే రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందనే సందేహాలు విన్పిస్తున్నాయి. డెంటల్ సర్జరీ అనేది హార్ట్ ఎటాక్ కారణం కావచ్చనేది వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. అసలు పళ్లకు , గుండెకు సంబంధమేంటనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పంటి సమస్య వచ్చినప్పుడు చాలామంది వెంటనే చేయించుకునేది రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్. కానీ దీనివల్ల గుండె పోటు వచ్చే ముప్పు ఉందని చాలా మంది భావిస్తుంటారు. కానీ రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ పూర్తిగా సురక్షితమని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసేటప్పుడు వెలువడే బ్యాక్టీరియా రక్తంలో లోపలకు ప్రవేశించి గుండె సహా శరీరంలో ఏదో ఒక భాగంలో ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావచ్చనేది కొంతమంది అభిప్రాయం. కానీ ఇది అవాస్తవం.
కానీ గుండెకు డెంటల్ హెల్త్‌కు మధ్యం సంబంధం ఉంది. పళ్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే వివిధ రకాల వ్యాధులు మొదలౌతాయి. అప్పుడీ బ్యాక్టీరియా నోట్లోంచి రక్తంలో చేరి గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. అందుకే చిగుళ్ల వ్యాధి ఉన్నవారిలో గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కానీ రూట్ కెనాల్ చేయించుకుంటే హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందనేది మాత్రం అవాస్తవం. పళ్లను శుభ్రంగా ఉంచుకుంటే గుండె ఆరోగ్యమే కాదు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండోడెంటిక్ థెరపీ అండ్ ఇన్సిడెంట్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ అధ్యయనం ప్రకారం రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ అనేది గుండె వ్యాధులకు కారణమౌతుందనేందుకు ఏ ఆధారం లేదు. పంటి కుదుళ్ల నుంచి ఇన్‌ఫెక్షన్ గురైన టిష్యూని తొలగించే ప్రక్రియే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్. దీనికి గుండె పోటు వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు.
Also read: Hair Fall Remedy: జుట్టు రాలడం, వైట్ హెయిర్ సమస్యను నెల రోజుల్లో తగ్గించే ఆయిల్ ఇంట్లోనే తయారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Root Canal and Heart: రూట్ కెనాల్ చికిత్సతో హార్ట్ ఎటాక్ వస్తుందా, నిజమేంటి