అమరావతి: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం టికెట్లను అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆడియెన్స్ కి, అభిమానులకు ఇబ్బందికరంగా మారనున్న ఈ చర్యను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయమై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖపట్టణం పోలీసు కమిషనర్, సాహో చిత్ర పంపిణీదారు దిల్ రాజు తదితరులకు హై కోర్టు నోటీసులు జారీచేసింది. సాహో చిత్ర టికెట్ల ధరలను రూ.100, రూ.200, రూ.300లుగా నిర్ణయించి, ఆడియెన్స్ జేబులకు చిల్లు పెట్టి, భారీ వసూళ్లు దండుకోవాలని చూస్తోన్న వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్మాత నట్టికుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు ఈ నోటీసులు జారీచేసింది.
ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సాహో సినిమా కేవలం భారత దేశంలోనే 10,000పైగా థియేటర్లలో తెరపై కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 2,000పైగా థియేటర్లలో సాహో సినిమా విడుదల కానుందని సమాచారం.
సాహో టికెట్ ధరల పెంపు వివాదం.. హై కోర్టు నోటీసులు