Union minister kishan reddy sensational comments on hydra: రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎం అయ్యాక పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఒక వైపు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తునే మరోవైపు గత ప్రభుత్వం హాయాంలో జరిగిన మోసాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. అంతేకాకుండా.. తెలంగాణాలో డ్రగ్స్ పైన కూడా సీఎం రేవంత్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక వైపు గతప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతూనే.. మరోవైపు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎక్కడ చూసిన హైడ్రా అనే సౌండ్ డబుల్ ట్రిబుల్ అయ్యింది.
జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మునిసిపాలిటీలు, గ్రామాల్లో హైడ్రా అధికారులు హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో విషయంలో అక్రమాలు జరిగితే బుల్డొజర్ లను దింపేస్తున్నారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలుపై సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను బుల్డోజర్ లను దింపి మరీ స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఈరోజు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తుమ్మిడి హట్టి చెరువును ఆక్రమించి సినీహీరో అక్కినేని నాగార్జున కన్వెన్షన్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఆయన హైడ్రా అధికారులు భారీ బుల్డోజర్ లతో తెల్లవారు జామునే అక్కడికి చేరుకుని కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నెలమట్టం చేశారు. దీనిపై నాగార్జున హైకోర్ట్ కు వెళ్లి స్టే సైతం తెచ్చుకున్నారు. కానీ అప్పటికే కింగ్ నాగార్జునకు.. జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైడ్రాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలో నిలిచాయి.
పూర్తి వివరాలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను డైవర్ట్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీల పథకం అమలుచేయకుండా.. కాంగ్రెస్ సర్కారు హైడ్రా అంటూ హాడావుడి చేస్తుందన్నారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్.. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దెవా చేశారు.
ఈనేపథ్యంలో ఆయన ఢిల్లీలో నుంచి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా మా.. నడుస్తోందన్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తు లేనీ పోనీ డ్రామాలుచేస్తున్నారన్నారు.
Read more: Cobra Snake: పిల్లి పిల్లలపై బుసలు కొడుతూ దాడిచేసిన బ్లాక్ కోబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..
దీనిపై గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొవాలన్నారు. ఇవన్ని అక్రమాలు అయితే.. గతంలో జీహెచ్ఎంసీ, రేరా, విద్యుత్, తాగునీరు, రోడ్ల సదుపాయాలు ఎందుకు కల్పించారన్నారు. అప్పట్లో అనుమతులిచ్చిన అధికారులు, వారిపై లోతైన విచారణ జరిపి చర్యలుతీసుకొవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Kishan reddy: హైడ్రాపేరుతో ‘హైడ్రామా’.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
రేవంత్ సర్కారుపై మండిపడిన కేంద్ర మంత్రి..
అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్..