Gold Rate In Hyderabad : బంగారం ధరలో మార్కెట్లో ఈరోజు స్వల్పంగా పెరిగింది. తాజాగా ఆగస్టు 13 మంగళవారం బంగారం ధరలు విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,300 పలుకుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,300 గా ఉంది. బంగారం ధరలు శ్రావణమాసం ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే గత వారం మాత్రం తగుముఖం పట్టాయి. ఈ వారం సోమవారంతో పోల్చితే మంగళవారం కూడా స్వల్పంగా బంగారం ధర 10 గ్రాముల పై వంద రూపాయల వరకు పెరిగింది.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా దేశీయంగా దిగుమతి సుంకం తగ్గడంపై ఆభరణాల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు దిగుమతి సుంకం తగ్గిన అనంతరం దేశీయంగా కూడా రేటు అందుబాటులోకి వస్తోంది. అయినప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న కారణాలవల్ల బంగారం ధరలు నేటికీ కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 70 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర ప్రస్తుతం అమెరికాలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కామెక్స్ లో ఒక ఔన్స్ అంటే సుమారు 31 గ్రాములు ధర దాదాపు 2400 డాలర్ల సమీపంలో వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి అవరోధంగా నిలిచింది. దీనికి తోడు చైనా సెంట్రల్ బ్యాంక్ ఎడాపెడా బంగారం నిలువలను కొనుగోలు చేయడం కూడా ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా నిలుస్తోంది.
బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి గత నెల భారీగా తగ్గుముఖం పడ్డాయి దాదాపు 67 వేల సమీపం వరకు పతనమైంది కానీ అక్కడ నుంచి బంగారం ధరలు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం 70,000 సమీపంలో బంగారం ధర ట్రేడ్ అవుతోంది. ఇక ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
దీంతో ఆభరణాల దుకాణాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి.హైదరాబాదులోని అన్ని ప్రధాన ఆభరణాల దుకాణాలన్నీ కూడా గత సంవత్సరం కన్నా ఎక్కువ స్థాయిలో సేల్స్ చూపిస్తున్నాయి.దీనికి ప్రధాన కారణం ఈ ఏడాది గరిష్ట స్థాయిన 75 వేల రూపాయల కన్నా బంగారం ధర తక్కువ ట్రేడ్ అవ్వడం కూడా ప్రధానంగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేదా అనే విషయంపై జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా బంగారం ధరలు తగ్గడానికి అనుకూలంగా లేవు దీంతో పసిడి ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook