Best Investment Plan: ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే సీనియర్ సిటిజన్లు నెలకు 50 వేల నుంచి 1 లక్ష రూపాయలు పొందవచ్చు

Best Investment Plan: రిటైర్మెంట్ తరువాత చాలామందికి సహజంగానే డబ్బులకు కొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు ప్రతి నెలా కొంత నగదు వచ్చే మార్గముంటే అంతకంటే సంతోషం ఉండదు. సీనియర్ సిటిజన్లకు ఇది చాలా అవసరం. అలాంటి స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 5, 2024, 04:56 PM IST
Best Investment Plan: ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే సీనియర్ సిటిజన్లు నెలకు 50 వేల నుంచి 1 లక్ష రూపాయలు పొందవచ్చు

Best Investment Plan: రిటైర్ అయిన తరువాత ప్రతి నెలా ఫిక్స్డ్ ఎమౌంట్ చేతికి అందాలని ప్రతి సీనియర్ సిటిజన్ కోరుకుంటాడు. దీనికోసం వివిధ రకాల పాలసీలు లేదా ఇన్వెస్ట్ ప్లాన్స్ ఆశ్రయిస్తుంటారు. సరైన అవగాహన లేకపోవడంతో ఆశించిన రిటర్న్స్ అందక నిరాశ చెందుతుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే స్కీంలో సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా 50 వేల రూపాయలు కచ్చితంగా అందుతాయి. అదెలాగో తెలుసుకుందాం..

సీనియర్ సిటిజన్లకు లేదా 50 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా బతకాలని అనుకునేవారికి ఇది బెస్ట్ స్కీం. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే నిర్ణీత వయస్సు 50 ఏళ్ల తరువాత ప్రతి నెలా 50 వేల రూపాయలు పెన్షన్ అందుకోవచ్చు. మీరు కేవలం 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మీ ఆదాయంలో 10 నుంచి 20 శాతం ఇన్వెస్ట్ చేస్తే చాలు. అంటే మీ జీతం ఒకవేళ 50 వేలు అయితే ప్రతి నెలా కనీసం 10 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. జీతం అంత లేకపోయినా ప్రతి నెలా 10 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే మంచిది. అందుకు తగ్గట్టుగానే రిటర్న్స్ ఉంటాయి. 

నెలకు 10 వేల రూపాయలు ఎస్ఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ SIP 15 ఏళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మీ పెట్టుబడిని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఈ ఎస్ఐపీని స్టెప్ బై స్టెప్ ఎస్ఐపీ అంటారు. నెలకు 10 వేల చొప్పున ఏడాది పాటు ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తే మరుసటి ఏడాది నుంచి పది శాతం పెంచి నెలకు 11 వేలు పెట్టుబడి పెట్టాలి. ఆ తరువాత ఏడాది మరో పది శాతం పెంచాలి. ఇలా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 1 కోటి రూపాయలు అవుతుంది. 

15 ఏళ్ల తరువాత ఈ కోటి రూపాయలు విత్ డ్రా చేయండి. అందులో సగం అంటే 50 లక్షల రూపాయలు మరో చోట ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన 50 లక్షల రూపాయలను మళ్లీ ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇప్పుడు మీరు ఒకేసారి 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు 15ఏళ్లకు కనీసం 12 శాతం రిటర్న్స్ లెక్కించినా చాలా ఎక్కువే అవుతుంది. అంటే 6 లక్షలు ప్రతి యేటా వస్తుంది. అంటే నెలకు 50 వేల రూపాయలు అందుకోవచ్చు. ఒకవేళ మొత్తం కోటి రూపాయల్ని ఇన్వెస్ట్ చేయగలిగితే నెలకు లక్ష రూపాయలు అందుకోవచ్చు. ఇది కచ్చితంగా మీ వృద్ధాప్యంలో మంచి ఆదాయం అవుతుంది.

Also read: Aadhaar Card Check: మీ ఆధార్ కార్డు అసలైందా లేక నకిలీనా, ఎలా తెలుసుకోవడం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News