Yamini Krishnamurthy: ఒక కాలిగజ్జె తిరిగిరాని లోకాలకు.. యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

Dancer Yamini Krishnamurthy Passed Away: భారత నాట్య రంగానికి విశేష సేవలు అందించిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆమె మృతికి దేశ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 3, 2024, 08:20 PM IST
Yamini Krishnamurthy: ఒక కాలిగజ్జె తిరిగిరాని లోకాలకు.. యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

 Yamini Krishnamurthy: తెలుగు నాట్య శిఖరం, దశాబ్దాల పాటు భరతనాట్యానికి విశేష సేవలు అందిస్తున్న యామినీ కృష్ణమూర్తి అనారోగ్యంతో 84వ యేటా కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో జన్మించిన ఆమె చెన్నైలో నృత్య శిక్షణ పొంది అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. కళా రంగంలో ఆమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ వంటి పురస్కారాలు దక్కాయి. కాగా ఆమె మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోపాటు ప్రముఖ నృత్యకారిణులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: Cable Operators: భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ప్రసారాలపై దుమారం.. జియో టీవీపై కేబుల్‌ ఆపరేటర్ల ఆందోళన

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో జన్మించిన యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడిలో నాట్యకారిణిగా గుర్తింపు పొందారు. 1957లో మద్రాస్‌లో నాట్యకళలో రంగ ప్రవేశం చేసిన ఆమె దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కూడా యామినీ సేవలు అందించారు. ఢిల్లీలో 'యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌'ను స్థాపించి భావి నృత్యకారులను తీర్చిదిద్దారు. అంతేకాకుండా నృత్యంపై 'ఏ ఫ్యాషన్‌ ఫర్‌ డ్యాన్స్‌' పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం శాస్త్రీయ నృత్యంపై అభిరుచి పెంచుతోంది.

Also Read: SC ST Classification: ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు నో చెప్పిందెవరు, ఎందుకు, ఆసలు ఆ న్యాయమూర్తి తీర్పులో ఏముంది

కాగా నృత్యరంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించింది. కాగా ఆమె మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రముఖ నృత్యకారులు రాజా రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు ఢిల్లీలో ఆదివారం జరుగుతాయని సమాచారం.

నృత్యానికి ఎనలేని సేవలు
'భారతదేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందా. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన నర్తకిగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు యామినీ కృష్ణమూర్తి తీసుకొచ్చారు. ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా'
- చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత

దిగ్భ్రాంతి
'యామినీ కృష్ణమూర్తి మరణ వార్త తీవ్ర ఆవేదనకు లోనయ్యా. కూచిపూడి, భరతనాట్యానికి ఆమె విశేష సేవలు అందించారు. ఈ కష్టకాలంలో ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నా'
- వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News