Supreme court verdict on SC/ST sub classification: కొన్నేళ్లుగా మన దేశంలో ఎస్సీ, ఎస్టీలు అణగారిన వర్గాలు సమాజంలో తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో.. అంబేద్కర్ రాజ్యంగం రూపొందించినప్పుడు.. అణగారిన వర్గాల వారి కోసం ప్రత్యేకంగా అధికరణలు, షెడ్యూల్స్ లను తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ లతో పాటు 6:1 నిష్పత్తిలో, వర్గీకరణపై కీలక తీర్పు వెలువరించారు.
Read more: LPG Gas Prices: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన సిలిండర్ ధరలు.. డిటెయిల్స్ ఇవే..
జస్టిస్ భేలా త్రివేది మాత్రమే దీన్ని విభేదించారు. మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు.. మాత్రం వర్గీకరణమీద రాష్ట్ర ప్రజలకు అధికారం ఉంటుందని కూడా తీర్పును వెలువరించాయి. ఇదిలా ఉండగా.. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు మాత్రం.. సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
మరోవైపు, ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బీఆర్ గవై భిన్నమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు- ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించి, వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కూడా అభిప్రాయపడింది. అప్పుడే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న కల ఉపవర్గీకరణ ద్వారా సాకారం అవుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు తీసుకురావడం వెనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని వివరించారు.
కేసు వివరాలు ఏంటంటే..?
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ లు దాఖలయ్యాయి. ఎస్సీ కోటాలో ఉపవర్గీకరణలు రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని 2004లో 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టింది. దీనిపై పునఃసమీక్ష కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
సుప్రీంతీర్పుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజాగా, ఇచ్చిన తీర్పును తెలంగాణ సర్కారు స్వాగతించింది. ఈ నేపథ్యంలో.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు అప్పట్లో వినిపించారు.
ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా.... ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎంరేవంత్ ప్రకటించారు.
ప్రస్తుతం.. అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని క్లారీటీ ఇచ్చారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామంటూ సీఎంరేవంత్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Supreme court: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమే.. సంచలన తీర్పువెలువరించిన సుప్రీం ధర్మాసనం..
కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు..
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అధికారం రాష్ట్రాలకే..