Just A Minute: ఘనంగా ‘జస్ట్ ఎ మినిట్’ మూవీ ట్రైలర్ లాంచ్.. జులై 19న సినిమా విడుదల..

Just A Minute: తెలుగులో ఈ మధ్య కాలంలో విభిన్న కథా చిత్రాలు వస్తున్నాయి. ఈ కోవలో ‘ఏడు చేపల కథ’ వంటి సినిమాతో పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 14, 2024, 03:45 PM IST
Just A Minute: ఘనంగా ‘జస్ట్ ఎ మినిట్’ మూవీ ట్రైలర్ లాంచ్.. జులై 19న సినిమా విడుదల..

Just A Minute: ‘ఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన సినిమా ‘జస్ట్ ఏ మినిట్’. ఈ చిత్రంలో నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా నటించారు.  రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్ సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో  తన్వీర్ మరియు ప్రకాష్ నిర్మాతలుగా మారారు.  యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  అంతేకాదు ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా నిర్మాత తన్వీర్ గారు మాట్లాడుతూ..

‘జస్ట్ ఏ మినిట్’  సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేసాము. ఈనెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రేక్షకులు సినిమా చూసి ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత ప్రకాష్  మాట్లాడుతూ :

ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాని అందరూ చూసి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు.

హీరోయిన్ నజియా ఖాన్ మాట్లాడుతూ..
ఈ చిత్రంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కి థాంక్స్. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ ఉంటాయి. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు.

హీరోయిన్ వినీషా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ..
‘జస్ట్ ఏ మినిట్’ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. అభిషేక్, ఫణితో పనిచేయడం చాలా సంతృప్తి నిచ్చింది.  మీడియా మరియు ప్రేక్షకులే సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు.

జబర్దస్త్ ఫణి  మాట్లాడుతూ :

నేను అభిషేక్ కలిసి పనిచేసిన ప్రతి సీను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. లవ్ తోపాటు మంచి ఎంటర్టైన్మెంట్ కు ఆడియన్స్ కు కొత్త అనుభూతి ఇస్తుందన్నారు. యశ్వంత్ కొత్త డైరెక్టర్ అయిన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.

హీరో అభిషేక్ పచ్చిపాల మాట్లాడుతూ..
ఈ సినిమా మొత్తం మంచి కామెడీతో సాగిపోతుంది. డైరెక్టర్ అభిషేక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మ్యూజిక్ డైరెక్టర్ బాజీ ఇచ్చిన సంగీత ప్రేక్షకులకు కొత్త కిక్ ఇస్తుంది.  నిర్మాతలు చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా ఎవరిని నిరాశ పరచదు. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కాబోతుంది.

దర్శకుడు యశ్వంత్ మాట్లాడుతూ..
నేను ముందు ఈ సినిమాకి కో డైరెక్టర్ గా వచ్చాను. అనుకోని కారణాలవల్ల నిర్మాత తన్వీర్ నాకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఈ నెల 19 విడుదల కాబోతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు. టెక్నీషియన్స్ :నిర్మాణం : రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్, నిర్మాతలు : రెడ్ స్పైన్ ఎంటర్టైన్మెంట్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి, ఎడిటర్ : దుర్గ నరసింహ,సినిమాటోగ్రాఫర్ : అమీర్,మ్యూజిక్ : ఎస్. కే. బాజీ
మ్యూజిక్ లేబుల్ : మధుర ఆడియోచ అసోసియేట్ డైరెక్టర్ : కార్తీక్ ధర్మపురి

Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News