జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తాను రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. పవన్ పోటీ చేసే స్థానాలపై తీవ్ర కసరత్తు చేసిన సెలెక్ట్ కమిటీ..చివరకు ఈ స్థానాలను ప్రకటించింది
అభ్యర్ధలు ఎంపిక చేసే బాధ్యతను జనసేన సెలక్ట్ కమిటీ కి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన సీటు విషయంలోనూ కమిటీ నిర్ణయమే ఫైలన్ అని పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సెలక్ట్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అనంతపురం, తిరుపతి, రాజానగరం, భీమవరం, పిఠాపురం, పెందుర్తి, గాజువాక, ఇచ్ఛాపురంలు అగ్రస్థానంలో నిలిచాయి.
అనంతరం ఈ ఎనిమిది స్థానాలపై పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. మెజార్టీ వర్గం భీమవరం, గాజువాకల నుంచి పవన్ పోటీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సూచన మేరకు ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
భీమవరం, గాజువాక బరిలో జనసేనాని @PawanKalyan #JANASENARevolution2019 #VoteForGlass pic.twitter.com/JEqE58xahP
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019