Team India to India: జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయంతో టీ20 ప్రపంచకప్ 2024 గెల్చుకున్న టీమ్ ఇండియూ అనూహ్యంగా అక్కడే చిక్కుకుపోయింది. బార్బడోస్‌లో చెలరేగిన హరికేన్ బెరిల్ తుపాను కారణంగా నాలుగు రోజులుగా బయటకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ పోరులో గెలిచి విజేతగా విజయగర్వంతో మాతృభూమిలో అడుగుపెట్టాల్సిన రోహిత్ సేన హోటల్ గదుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బార్బడోస్‌లో హరికేన్ బెరిల్ కారణంగా మొత్తం జట్టు సభ్యులు చిక్కుకుపోయారు. ప్రచండవేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాలతో పరిస్థితి భయానకంగా ఉంది. విమానాశ్రయాలు మూసివేశారు. దాంతో టీమ్ ఇండియా బయలుదేరాల్సిన విమానం కూడా రద్దయిపోయింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ప్రత్యేక విమానంలో కూడా రప్పించలేని పరిస్థితి. బార్బడోస్ సహా చుట్టుపక్కల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా కూడా నిలిచిపోయింది.
ఇవాళ కూడా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో టీమ్ ఇండియా బయలుదేరే పరిస్థితి లేదు. ఇక రేపే టీమ్ ఇండియా సభ్యులు ప్రత్యేక ఫ్లైట్ ద్వారా నేరుగా ఢిల్లీకు చేరుకోనున్నారు. బీసీసీఐ ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బార్బడోస్‌లో నాలుగు రోజులుగా చిక్కుకున్న టీమ్ ఇండియా సభ్యుల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు బీసీసీఐ తెలుసుకుంటోంది. టీమ్ ఇండియా సభ్యులతో పాటు అక్కడ చిక్కుకున్న భారతీయ మీడియాను కూడా బీసీసీఐ రప్పిస్తోంది.
Also read: Hurricane Beryl in Barbados: తుపానులో చిక్కుకున్న టీమ్ ఇండియా, ఇవాళైనా వస్తారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook