Sobhita Dhulipala voice over in Kalki: ప్రభాస్, నాగ్ అశ్విన్.. కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కల్కి సినిమా.. విడుదలై ఎన్ని రోజులు గడుస్తున్నా కలెక్షన్ల పరంగా మాత్రం.. అదే జోరు కనబరుస్తుంది. మొదటి రోజు నుంచి.. ఈ సినిమా భారీ కలెక్షన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా కనిపించింది. కల్కి పాత్రకి జన్మనివ్వబోయేది ఆమె. ఆమెను పట్టుకోవడానికి భైరవ పాత్రలో.. ప్రభాస్ ఆమె వెంట పడుతూ ఉంటాడు. అశ్వత్థామ పాత్రులో అమితాబ్ బచ్చన్.. ఆమె పాత్రను కాపాడుతూ ఉంటాడు.
భారీ తారాగణంతో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమాలో చాలామంది క్యామియో పాత్రలలో.. కనిపించారు. అయితే ఈ సినిమాలో శోభిత ధూళిపాల కూడా ఒక చిన్న భాగమే అని తెలుసా? శోభిత ఈ సినిమాలో కనిపించదు కానీ ఆమె గొంతు మాత్రం మనకి వినిపిస్తుంది. ఈ సినిమాలో దీపికా పడుకొనే పోషించిన సమ్ 80 (సుమతి) పాత్రకి డబ్బింగ్ చెప్పింది.. మరెవరో కాదు.. శోభిత ధూళిపాళ. తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత.. గూడచారి , మేజర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది.
హిందీ.. మలయాళంలో.. సినిమాలు చేసిన శోభిత ఈ మధ్యనే మంకీ మాన్ సినిమాతో హాలీవుడ్ కి కూడా పరిచయమైంది. ప్రస్తుతం హిందీలో సితార.. అనే సినిమాతో బిజీగా ఉన్న శోభిత మీ.. కల్కి 2898 ఎడి సినిమాలో దీపిక పడుకొనే పాత్రకి డబ్బింగ్ చెప్పింది.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ ట్రెండ్ అవుతుంది. దీపికకి డబ్బింగ్ చెప్పింది శోభితనా అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా దీపికా పడుకోనె కి.. శోభిత వాయిస్ చాలా బాగా సెట్ అయింది అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
కల్కి సీక్వెల్ లో కూడా దీపిక పడుకునే పాత్రకి శోభితనే వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని.. తనకి ఆ వాయిస్ చాలా బాగుందని అభిమానులు చెబుతున్నారు. ఇలా శోభిత ధూళిపాళ కూడా కల్కి సినిమాలో.. ఒక చిన్న భాగం అయింది.
Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం
Also Read: C Naga Rani IAS: వెస్ట్ గోదావరికి పవర్ ఫుల్ ఆఫీసర్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అందరికీ హడలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
కల్కి సినిమాలో శోభిత ధూళిపాళ.. అసలు ఈ విషయం గమనించారా?