Rahu Nakshatra Parivartan 2024: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు.. 3 రాశులవారిక ధనమే ధనం..

Rahu Nakshatra Parivartan 2024: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2024, 09:40 AM IST
Rahu Nakshatra Parivartan 2024: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు.. 3 రాశులవారిక ధనమే ధనం..

Rahu Nakshatra Parivartan 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో రాహువు గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం కేవలం నిర్ధిష్ట సమయంలోనే రాశి సంచారం చేస్తుంది. ప్రతి గ్రహం లాగా ఈ గ్రహం కూడా ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేక్షమైన ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం ఈ గ్రహం మీన రాశితో పాటు రేవతి నక్షత్రంలో సంచార క్రమంలో ఉంది. అయితే ఇటీవల జూలై 8న ఈ గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో రాహువు నక్షత్ర సంచారం చేయడం కారణంగా 12 రాశులవారిపై ప్రత్యక్ష ప్రభావం పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శని నక్షత్రంలోకి ఈ రాహువు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం పడుతుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ ఉత్తర భాద్రపద నక్షత్రాన్ని విజయంతో పాటు ఆర్థిక లాభాలు, సంతోషం, ఆధ్యాత్మికతకు సూచికగా భావిస్తారు. అయితే ఈ నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం కారణంగా మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశివారి ఎలా ఉంటుందో? ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

వృషభ రాశి:
రాహువు గ్రహం నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా వృషభ రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా వెంటనే పూర్తయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో గుడ్‌ న్యూస్‌ వింటారు. అంతేకాకుండా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. పిల్లల నుంచి కూడా మంచి శుభవార్తలు కూడా వింటారు. 

తులారాశి:
తులా రాశివారికి కూడా ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు అదృష్టం కూడా  రెట్టింపు అయ్యి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు కూడా పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి అనేక లాభాలు, కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. దీంతో పాటు ఆరోగ్యంపై కూడా వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా గతంలో నిలిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News