Apigate తో చేతులు కలిపిన ZEE5; ఇక నుంచి మరింత మెరుగైన సేవలు

ఇక నుంచి మరింత మెరుగైన సేవలు   ZEE5 సేవలు మరింత విస్తరించనున్నాయి                

Last Updated : Feb 26, 2019, 12:15 PM IST
Apigate తో చేతులు కలిపిన ZEE5; ఇక నుంచి మరింత మెరుగైన సేవలు

స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ)   అట్టహాసంగా ప్రారంభమైంది.  ఫిబ్రవరి 25నుంచి 28వ తేదీ వ‌ర‌కు  మూడు రోజుల పాటు ఈ  ఇందులో భాగంగా ప‌లు ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీలు త‌మ త‌మ నూత‌న స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. 

మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నిరంతరం వినాదోన్ని పంచే ZEE5 ఇప్పుడు సరికొత్త భాగస్వామితో చేతులు కలిపింది. ప్రముఖ Apigateతో ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామంతో  zee5 సేవల మరింత విస్తరించనున్నాయి. తాజా ఒప్పందం వల్ల ఇప్పుడు ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా మరియు యూరప్, లండన్ వరకు సేవలు విస్తరించనున్నాయి.

జీ ఎంటర్‌టైన్మెంటె ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)లో భాగమైన ZEE5 ఇప్పటికే 12 భాషల్లో ప్రేక్షకులు వినోదాన్ని పంచుతోంది. ఇందులో భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వార్తలు మరియు మ్యూజిక్ మరియు ఇతర వినోదాన్ని పంచే వీడియోలు, ఎక్ల్యూజివ్ వీడియోలు దేశంలోని  వివిధ భాషల్లో ప్రసారం అవుతున్నాయి. హిందీ మరియు ఆంగ్ల భాషతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలాయలం లాంటి సౌత్ ఇండియన్ భాషలతో పాటు మరాఠీ, ఒడియా, బోజ్ పూరి, గుజరాతి, బెంగాలీ మరియు పంజాబ్ భాషల్లో తన సేవలను అందిస్తోంది. ఇందులో ప్రముఖ 60 ప్రధాన టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేస్తోంది

తాజా ఒప్పందం వల్ల ZEE5  మరింత విస్తరించేందుకు అవకాశం దొరికింది.ప్రపంచంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ప్రసారం కానుంది. Apigate  యుజర్లు ఇక నుంచి ZEE5 లో ప్రధాన కార్యక్రమాలు కుంకుం భాగ్య, జోధా-అక్బర్, కరంజిత్ కౌర్, జీరో కేఎంఎస్, క్రిమ్ త్రిల్లర్ పెయింటర్స్, అబ్హయ్, బాలీవుడ్ హిట్స్ వెరెల్ ది వెడ్డింగ్ లాంటి కార్యక్రమాలు వీక్షించే అవకాశం కల్గింది. బ్లాక్ బాస్టర్ షోలైన కేదార్నాథ్, అభయ్ (కునాల్ కేమ్ము), ఫైనల్ కాల్ (అర్జున్ రాంపాల్), రంగ్బాజ్ (సక్బ్ సలీమ్) మరియు షరాట్ అజ్ లాంటివి కా ర్యక్రమాలు వీక్షించే వీలు కల్గింది..

తాజా ఒప్పందంపై జీ ఇంటర్నేషనల్ మరియు ZEE5 కు చెందిన సీఈవో అమిత్ గోయనకా స్పందించారు. ఇప్పుడు మనం గ్లోబర్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ సిద్ధచేయాల్సి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలు నచ్చే రీతిలో కంటెంట్ ను తయారు చేయాల్సిన లక్ష్యంతో పనిచేయాల్సి ఉందన్నారు. ZEE5 చాలా వేగంగా విశ్వవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నామని.. ఈ క్రమంలో మేం Apigate తో కలిసి విజయవంతంగా ముందడుగు వేస్తున్నామని అమిత్ గోయనకా తెలిపారు.

తాజా ఒప్పందంపై ZEE5 బిజినెస్ ఆఫీసర్ అర్చనా ఆనంద్ కూడా స్పందిస్తూ...తమ క్యాలిటీతో కూడిన  కంటెంట్ సముదాయం ఉంది. ఎలాంటి ప్రేక్షకులనైనా ఆకట్టుకునే శక్తి తమ కంటెంట్ లో ఉంది.. ఈ నేపథ్యంలో మేం చాలా వేగంగా గ్లోబల్ మార్క్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా Apigate సీఈవో జోరన్ విజిల్ జేవ్ మట్లాడుతూ ZEE5 బ్రాండ్ తో కలిసినందుకు మేం సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.  Apigate అరబ్ దేశాలతో పాటు ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా  మరియు యూరప్ దేశాల్లో  తమ నెట్ వర్క్ విస్తరించి ఉందని ఈ సందర్భంగా జోరన్ విజిల్ జేవ్ తెలిపారు
 

 

Trending News