Ind Vs USA T20 World Cup 2024: ఇదేం ఆటరా బాబు.. శివమ్ దూబే మెడపై కత్తి.. ఆ ప్లేయర్‌కు తుది జట్టులో ఛాన్స్..!

Ind Vs USA Match Updates: అమెరికాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ నుంచి వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఫీల్డింగ్‌లో కూడా దూబే ఆకట్టులేకపోతున్నాడు.    

Written by - Ashok Krindinti | Last Updated : Jun 11, 2024, 05:10 PM IST
Ind Vs USA T20 World Cup 2024: ఇదేం ఆటరా బాబు.. శివమ్ దూబే మెడపై కత్తి.. ఆ ప్లేయర్‌కు తుది జట్టులో ఛాన్స్..!

Ind Vs USA Match Updates: అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచ కప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. లోస్కోరింగ్ గేమ్స్‌ ఆడియన్స్‌ను ఫుల్ మజాను అందిస్తున్నాయి. పొట్టి కప్‌లో పెను సంచనాలు నమోదవుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అఫ్ఘానిస్థాన్, యూఎస్ఏ, స్కాట్లాండ్ వంటి జట్లు సూపర్-8కి రేసుకు గట్టి పోటీనిస్తున్నాయి. ఇక టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. దీంతో 4 పాయింట్లు, 1.455 నెట్ రన్‌ రేట్‌తో గ్రూప్-ఏ నుంచి సూపర్-8లో దాదాపు బెర్త్‌ కన్ఫార్మ్ చేసుకుంది. అమెరికా లేదా కెనడాపై ఒక్కటి గెలిచినా టీమిండియా సూపర్-8లో ఎంట్రీ ఇస్తుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే టాప్ ప్లేస్‌తో ఉంటుంది.

Also Read: Ram mohan nayudu: తెలంగాణ ప్రజల కోసం దేనికైనా రెడీ.. మరోసారి ప్రజల మనస్సులు టచ్ చేసిన  రామ్మోహన్ నాయుడు..

ఇక రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా.. రెండు మ్యాచ్‌ల్లోనూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో దుమ్ములేపి టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే పర్ఫామెన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకున్నా.. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో తరువాతి మ్యాచ్‌కు దుబేను పక్కనబెట్టాలని డిమాండ్స్ వస్తున్నాయి.

యూఎస్‌ఏతో తదుపరి మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్‌ 11లో మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇతర ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లో తడబడుతున్న దూబేను పక్కనపెట్టాలని మాజీలు సూచిస్తున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను కూడా దుబే జారవిడిచాడు. దీంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దుబే స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌కు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలంటే సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలో శివమ్ దూబే తన బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. ధోనీ నాయకత్వంలో తన బ్యాటింగ్‌కు మెరుగులు దిద్దుకున్నాడు. ఈ పర్ఫామెన్స్‌తోనే అతడిని టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారు. మిడిల్ ఆర్డర్‌లో దూకుడు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేస్తాడని కేఎల్ రాహుల్, శ్రేయాస్ వంటి ప్లేయర్లను కాదని దూబేకు అవకాశం కల్పించారు. అయితే వరల్డ్ కప్‌కు ఎంపికైనప్పటి నుంచి దూబే ఆటతీరు గాడితప్పింది. ఐపీఎల్ చివరి దశలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌లోనూ పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. 

Also Read: Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News