బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకోన్, రణవీర్ సింగ్ లు ఇటీవలే పెళ్లి బంధంతో ఏకమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ జంటపై మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో మీడియా ముందు నటీ దీపిక ఓ రహస్యాన్ని బయటపెట్టేంది.. అదేనండి తన ఎంగేజ్ మెంట్ రహస్యం. నాలుగేళ్ల క్రితమే రణవీర్ సింగ్ తో తన ఎంగేజ్ మెంట్ జరిగిందని ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
ఈ సారి తన బర్త్ డే కు ప్రత్యేకత ఉందన్న దీపిక
తమ ఎంగేజ్ మెంట్ విషయం బయటకు రాకున్నా... తమ గురించి వార్తలు వస్తూనే వచ్చాయని దీపిక చమత్కరించింది. ఓ కార్యక్రమంలో పాల్గొన దీపిక మీడియా ముందు ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే రానున్న తన పుట్టినరోజు ఎంతో స్పెషల్ అని... ఒకరి భార్యగా తొలి పుట్టినరోజును జరుపుకోబోతున్నానని దీపికా పదుకోన్ వ్యాఖ్యానించింది. భార్య మీడియాతో మాట్లాడుతుండగా రణవీర్ సింగ్ చిరునవ్వులు చిందించడం తప్పితే ఏ మాట్లాడలేకపోయాడు.