AP Land titling Act: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇపుడు ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. ఏపీ రాజకీయాలను హీట్ పుట్టిస్తోన్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ అసలు ఎలా వచ్చింది. ఇది అమలు చేయాలనేది ఎవరి ఆలోచన ? ఏపీలోని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఈ యాక్ట్ పై విరుచుకుపడుతున్న టీడీపీ కూటమి ఈ యాక్ట్ పై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు. ఎలాగో అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకంతోనే చంద్రబాబు.. రెండు సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే పెడతానని చెప్పడం ద్వారా ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారా నిజంగానే జనం పాలిట ఈ యాక్ట్ యమపాశమా అంటే..
అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం తెచ్చిందే ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో జట్టుకట్టిన కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నీతి ఆయోగ్ ఆమోదం మార్గదర్శకాలు జారీ చేస్తే.. మూడే
ళ్ల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజలకు మేలు చేసేలా ఉందన్న ఉద్దేశ్యంతో ముసాయిదా చట్టాన్ని రూపొందించి భూముల రీ సర్వే చేపట్టింది. దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నదే. ఏపీలోను ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు కొంత మంది నిపుణులు చెబుతున్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఎలాంటి అపోహలు, అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు నిపుణులు. చట్టం అమల్లోకి వస్తే ఏపీలోని భూములకు గ్యారంటీ లభిస్తుందని చెబుతున్నారు. భూముల రక్షణతో పాటు కొనుగోళ్లు మరింతగా ఊపందుకుంటాయిని చెబుతున్నారు. అంతేకాదు రాష్ట్రాభివృద్ధికి అతి గొప్ప సంస్కరణగా నిలుస్తుందన్నారు.
భూములపై శాశ్వత హక్కు లభించే టైటిల్ ద్వారా కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. ప్రస్తుతం తమ పేరు మీద భూమి ఉంటే .. ఈ యాక్ట్ ద్వారా నమోదు చేయించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్న మాట. ఈ యాక్ట్ అమలు చేయడం ద్వారా భూములకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు వందకు వంద శాతం అర్హులకు మాత్రమే లభిస్తుంది.
భూముల హక్కలు, వివాదాల పరిష్కారం కోసం వీఆర్వో, ఆర్ :, తహసీల్దార్, సివిల్ కోర్టులు, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టుల చుట్టూ జనాలు తిరగాల్సిన అవసరమే లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం వల్ల వీళ్లందరి ప్లేస్‌లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక్కరే ఉంటారు. తర్వాత అప్పిలేట్ అధికారి, హైకోర్టు నెక్ట్స్ తదుపరి పరిష్కార మార్గాలుగా ఉంటాయి. ఈ యాక్ట్ వల్ల ఓ వివాదం వీలనంత తొందరగా పరిష్కారం లభిస్తుంది. ఇది మనకు కొత్తది. ఒక చిన్న స్థల వివాదాస్పదమైతే.. దాని పరిష్కారం కోసం ఏళ్లకు ఏళ్లుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యాక్ట్ వల్ల ఆ దుస్థితి నుంచి ప్రజలు బయటపడతారనేది నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter