Karnataka Govt Hikes DA: లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు సీఎం సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం 38.75 శాతం డీఏ అందుతుండగా.. 42.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు. డీఏ పెంపుతో ప్రతి సంవత్సరం రూ.1,792.71 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. సెంట్రల్ పే స్కేల్లను డ్రా చేసుకునే ఉద్యోగులకు డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి సవరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
Also Read: Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్
ఇటీవలె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 50 శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు 46 శాతం ఉండగా.. 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. జనవరి 1, 2024 నుంచి పెంచిన డీఏ, డీఆర్ అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో కోటి మంది ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రయోజనం చేకూరింది. లేబర్ బ్యూరో ద్వారా నెలవారీగా విడుదలయ్యే ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా డీఏను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. డీఏ, డీఆర్ 4 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50 శాతానికి పెరగనుంది. తాజాగా పెంచిన డియర్నెస్ అలవెన్స్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో 68,818 మంది ఉద్యోగులు, 33,200 మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఏడాదికి రూ.124.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనుంది.
డీఏ పెంపుపై సీఎం పెమా ఖండూ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో తాము అంకితభావంతో పని చేస్తున్నామన్నారు. అంతకుముందు యూపీ సర్కారు కూడా డీఏను పెంచిన విషయం తెలిసిందే. డీఏను 4 శాతం పెంచడంతో 50 శాతానికి పెరిగింది. దీంతో దాదాపు 28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరింది.
Also read: Diarrhea After Eating Bananas: అరటిపండ్లు తిన్న వెంటనే మలవిసర్జన..కారణాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter