Best Weight Loss Tips in Telugu: ప్రతి రోజు ద్రాక్ష తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ఈ ద్రక్షలో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే రోజూ ఉదయం ద్రాక్ష రసాన్ని తాగడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. అయితే ఈ ద్రాక్ష రసాన్ని తాగడం వల్ల కలిగే ఇతర లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బరువు నియంత్రణ:
ద్రాక్ష పండ్ల రసం ప్రతి రోజు తాగడం వల్ల కేవలం 14 రోజుల్లో బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసంలో ఉండే ఔషధ గుణాలు బాడీలో పేరుకుపోయిన చెడు పదార్థాలను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఉదయం పూట ద్రాక్ష రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
మైగ్రేన్ సమస్యలకు చెక్:
ప్రస్తుతం చాలా మందిలో మైగ్రేన్ సమస్య అనేది నిద్రలేమి కారణంగా వాతావరణంలో మార్పు, జీర్ణక్రియ సమస్యలు కారణంగా వస్తోంది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు న్యాచురల్‌గా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు ఉదయం పూట ద్రాక్ష రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల సులభంగా మైగ్రేన్ ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ద్రాక్ష రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరం కూడా నిర్విషీకరణ అవుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది:
పొటాషియం పుష్కలంగా లభించే రసాల్లో ద్రాక్ష రసం కూడా ఒకటి. ఇందులో BPని నియంత్రించే గుణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. కాబట్టి ద్రాక్ష రసం తాగడం వల్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter