Friendly Zodiac Signs Of Shani Dev: శని దేవుడిని కర్మ ఫలదాత అని పిలుస్తారు. శని దేవుడు మన కర్మలను ఎల్లప్పుడు గమనిస్తాడు. అందుకే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. అయితే శని ప్రభావం వల్ల కష్టాలు కలుగుతాయని అందరుం భావిస్తారు. కానీ శని ప్రభావం వల్ల కష్టాలు మాత్రమే కాకుండా లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జాతకంలో శని ప్రతికూల స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితాల్లో ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా కొన్ని రాశుల వాళ్ళు అంటే శని దేవుడికి ఎంతో ప్రీతి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశుల వాళ్ళకి జాతకంలో శని ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు.
శని దేవుడికి ఇష్టమైన రాశులు:
మకర రాశి: మకర రాశి వారికి శని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వ్యక్తులపై శని అననుకూల ప్రభావాలను కలిగిస్తుంది. శనిదేవుడు మకర రాశికి అధిపతిగా వహిస్తాడు. ఈ రాశివారిలో శని ప్రవేశించినప్పుడు ప్రతి రంగంలో శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల రాశి: శని దేవుడికి ఇష్టమైన రాశిచక్రాలలో తుల రాశి ఒకటి. శని దేవుడు అధిక రాశిగా పరిగణిస్తారు. శని తుల రాశి వారికి ఎల్లప్పుడూ దయతో ఉంటాడు.
కుంభ రాశి: కుంభరాశి వారికి శనిదేవుడు చాలా అనుకూలంగా ఉంటాడు. ఈ రాశి వారు ప్రతి రంగంలోను విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్ధిక విషయాలలో శని దేవుడు వీరిపై దయతో ఉంటాడు.
శిని దేవుని మంచి ప్రభావం వల్ల పలు రాశులవారి జీవితంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలే ఉంటాయి. మఖ్యంగా శని దేవుడి ఆశీర్వదాలు లభించి అనుకున్న పనులన్ని సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా కోరికలు కూడా నెరవేరుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ విధంగా శని దేవుడు ఈ రాశుల వారిపైన ఎంతో దయతో కలిగి ఉంటాడు. శని ప్రభావం వల్ల అనుకున్న పనులు, ధనవంతులు, రంగంలో విజయాలు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Also Read : February Rasi Phalalu 2024: ఫిబ్రవరి నెల రాశి ఫలాలు..ఈ రాశులవారికి డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter