NZ vs PAK: కివీస్ టీమ్ లో క‌రోనా క‌ల‌క‌లం.. ఆ స్టార్ ఓపెన‌ర్‌కు పాజిటివ్..

Newzealand Cricket Team: న్యూజిలాండ్ టీమ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా స్టార్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వే క‌రోనా బారిన పడ్డారు. ఇంతకముందే ఆల్‌రౌండ‌ర్ మిచెల్ శాంట్న‌ర్ కు కరోనా సోకింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 04:39 PM IST
NZ vs PAK: కివీస్ టీమ్ లో క‌రోనా క‌ల‌క‌లం.. ఆ స్టార్ ఓపెన‌ర్‌కు పాజిటివ్..

NZ vs PAK 04th T20I Prediction: న్యూజిలాండ్ క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్ప‌టికే ఆల్‌రౌండ‌ర్ మిచెల్ శాంట్న‌ర్ (Mitchell Santner) క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా మరో స్టార్ బ్యాటర్ కు కొవిడ్ సోకింది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (Devan Conway)కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు న్యూజిలాండ్ క్రికెట్ సోష‌ల్‌మీడియా ద్వారా వెల్ల‌డించింది. దీంతో అలర్ట్ అయిన మేనేజ్‌మెంట్ కాన్వేను ఐసోలేష‌న్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జ‌రిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు కాన్వే దూరం కానున్నాడు. అతడి స్థానంలో చాడ్ బోవెస్‌(Chad Boves)ను ఎంపిక చేసింది టీమ్ మేనెజమెంట్. కాన్వే రావ‌డంతో క్రిస్ట్‌చ‌ర్చ్‌లో జ‌ట్టు బ‌స చేసిన హోటల్‌లో విశ్రాంతి తీసుకోనున్నాడు. 

అంతేకాదు ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్ ఆండ్రే ఆడ‌మ్ కూడా క‌రోనా బారిన పడినట్లు న్యూజిలాండ్ బోర్డు తెలిపింది. అతడి ప్లేస్ లో కాంటెన్ బ‌రీ మెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కోచ్ బ్రెండ‌న్ డంకెర్స్(Brendon Dunkers)ను తీసుకోనున్నారు. స్వ‌దేశంలో పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న ఐదు టీ20ల‌ సిరీస్‌లో కివీస్ దుమ్మురేపుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో కివీస్ గెలిచి 3-0తో ఆధిక్యంలో నిలిచింది.శుక్ర‌వారం క్రిస్ట్‌చ‌ర్చ్‌లోని హ‌గ్లే ఓవ‌ల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కివీస్ ను ఓడించి కెప్టెన్‌గా షాహీన్ ఆఫ్రిది తొలి బోణి కొట్టాలని చూస్తున్నాడు. ఇదే మైదానంలో జ‌న‌వ‌రి 21న‌ ఐదో టీ20 జరగనుంది. 

Also Read: Surykuamr Yadav: సూర్యకుమార్‌కు స‌ర్జ‌రీ సక్సెస్.. ఫోటోలు షేర్ చేసిన మిస్టర్ 360 ఫ్లేయర్..

Also Read: Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో అప్ డేట్.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ముంబై పోలీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News