AP Politics: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ (YSRCP) అధిష్టానం షాకిచ్చింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi), ఆనం రామ నారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) లపై ఫిర్యాదు స్పీకర్‌కు ఫిర్యాదు అందజేసింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి.రామచంద్రయ్యలపై వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్‌ను కోరింది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. వంశీ క్రిష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి ఊహించని షాకిచ్చారు. పార్టీ విప్‌ను ధిక్కరించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి.. మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఊహించని విధంగా విజయం సాధించారు. దీంతో అప్పుడు ఈ నలుగురిని పార్టీని సస్పెండ్ చేసింది.
ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. గ్రౌండ్ లెవల్‌లో రిపోర్ట్ ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట పార్టీ ఇంఛార్జ్‌లను మారుస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిరాశతో ఉన్నా.. భవిష్యత్‌లో అవకాశాలు వస్తాయని అధిష్టానం భరోసా ఇస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నట్లు ఇటీవల భారీస్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయానికి ఏపీ రాజకీయాలు (AP Politics) మరింత వేడేక్కనున్నాయి.
Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
CM Jagan Mohan Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు షాకిచ్చిన వైసీపీ