Gold Rate Today: బంగారం, వెండి ధరలు తగ్గాయి.. వెండి పట్టీలు.. బంగారు నెక్లెస్‎లు కొనుక్కోవచ్చు

Gold Rate Today:  కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా భారీగా పెరిగాయి. రోజురోజుకు భారీగా  పెరుగుతూ దూసుకెళ్తుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందారు. అయితే వారందరికీ ఇప్పుడు  శుభవార్త. ఈ న్యూ ఇయర్ లో మొదటిసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /7

Gold Rate Today:  గ్లోబల్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజుతో పోల్చితే నేడు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2638 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతుంది. అలాగే స్పాట్ వెండి రేటు ఔన్సుకు  29.64 డాలర్ వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు మన భారతదేశ కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లో 85.800 కనిష్ట స్థాయిలో  అమ్ముడు అవుతోంది

2 /7

ఈ ఏడాదిలో తొలి నాలుగు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు ఎట్టకేలకు దిగి వచ్చాయి. జనవరి 5వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై 450 రూపాయల తగ్గింది.

3 /7

దీంతో తులం ధర 72,000 దిగివచ్చింది.24 క్యారెట్ల బంగారం ధర  490 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల ధర 78 వేల 710 వద్దకు చేరుకుంది.  

4 /7

 కొత్త సంవత్సరంలో భారీగా పెరిగి లక్ష రూపాయల పైకి చేరిన వెండి ధర.. ఇవాళ కాస్త దిగివచ్చింది. కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో నేడు 1000 రూపాయల తగ్గింది. దీంతో కిలో రేటు లక్ష దిగువకు చేరుకుంది.

5 /7

ప్రస్తుతం కిలో వెండి 99వేల మార్కు వద్ద ట్రేడింగ్ అవుతుంది. అయితే పైన చెప్పిన ధరల్లో ఎలాంటి టాక్స్ చార్జీలు లేవు అవన్నీ కలిపితే ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి .  

6 /7

 దేశంలో వరుస పండగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. దీనికి తోడు సంక్రాంతి కోసం కూడా చాలామంది ఇప్పటి నుంచే బంగారం వెండి షాపింగ్ చేస్తుంటారు

7 /7

 ఈ క్రమంలో చాలామంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ వెళ్లాలని చూస్తున్నారు. అలాంటివారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలు గమనించి వెళ్లడం మంచిది.