Face Packs For Glowing Skin: మహిళ్లలు అందంగా కనబడాలని వివిధ మేకప్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల అందంగా కనిపించిన తర్వాత చర్మ సమస్యల బారిన పడుతుంటారు. అయితే చర్మ సంరక్షణతో పాటు అందం కనిపించాలి అంటే ఇంట్లోనే సహజమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. వీటిని తయారు చేయడానికి ఇంట్లో లభించే పదార్థాలు సరిపోతాయి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. పసుపు, శెనగపిండి ప్యాక్: పసుపు, శెనగపిండి చర్మమానికి ఎంతో మేలు చేస్తుంది. దీని కోసం మీరు ముందుగా శెనగపిండి, పసుపును తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండిని తీసుకుని,ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రోజ్ వాటర్ వేసి మందపాటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాని 15నిమిషాల పాటు ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ చేయడం వల్ల చర్మం అందంగా కనిపిస్తుంది.
2. గంధం: గంధంలో అనేక చర్మ కాంతి గుణాలు దాగి ఉన్నాయి. గంధం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ముందుగా గంధం పొడిలో ఒక 1 టీస్పూన్ బాదం నూనె మరియు 1 టీస్పూన్ తేనెను మిక్స్ చేయాలి. 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
3. తేనె -నిమ్మకాయ: తేనెను నిమ్మరసంలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ముందుగా గిన్నెలో ఒక టీస్పూన్ తేనె , నిమ్మరసం కలిపి ఫేస్‌కు పట్టించాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలుగుతాయి.
Also read: Tips For Shining Nails: ఈ చిట్కాలతో మీ గోళ్లు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి
4. పెరుగు,ముల్తానీ మిట్టి: దీని కోసం ముందుగా రెండు స్పూన్‌ల పెరుగు, ఒక స్పూన్ శెనగ పిండి, ముల్తానీ మిట్టి తీసుకోవాలి. ఈ మూడిటిని బాగా కలిపి చర్మంపై రాసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని చర్మనిపుణులు చెబుతున్నారు.
5. కాఫీ పొడి తేనె: ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతులతో ముఖాన్ని సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయాలి.అనంతరం నీటితో ముఖాన్ని కడగాలి. ఇవి సహజమైన మాయిశ్చరైజర్ పనిచేస్తాయి.
Also read: Winter Fog: చలి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter