Bottle Gourd For Reducing Cholesterol: సోరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే భారతీయులు ఎక్కువగా ఆహారాల్లో తీసుకుంటారు. సోరకాయను రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. అయితే దీనిని జ్యూస్‌లా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలోకి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని ఉష్ణోగ్రతలను కూడా తగ్గిస్తుంది. ఈ రసంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని ప్రతి రోజు తాగాలనుకుంటే.. తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పద్దతిలో తయారు చేసుకుని తాగితే మంచి సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. శరీరంలోని విటమిన్ లోపం సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతి రోజు ఈ సోరకాయ రసాన్ని ప్రతి రోజు తాగొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
సోరకాయ రసం తయారీకి కావలసిన పదార్థాలు:
✾ 1 సోరకాయ
✾ అర టీ స్పూన్ జీలకర్ర పొడి
✾ అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి
✾ 1 అంగుళం అల్లం ముక్క
✾ 2 టీస్పూన్ల నిమ్మరసం
✾ 2 టేబుల్ స్పూన్ల పుదీనా రసం
✾ 1 గ్లాసు చల్లని నీరు
✾ రుచికి సరిపడ ఉప్పు
✾ 4 ఐస్ క్యూబ్స్
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
సోరకాయ రసం రెసిపీ తయారి విధానం:
ముందుగా సోరకాయను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పుదీనా ఆకులను రసంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలను మిక్సర్ బ్లెండర్లో వేసి, జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. అందులోనే జీలకర్ర పొడి, అల్లం ముక్కలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో పై పదార్థాలను వేసుకుని జ్యూస్‌లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జ్యూస్‌ను వడకట్టుకుని సర్వ్ చేసుకునే క్రమంలో ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ప్రతి రోజు తాగితే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter