Foods For Thyroid Levels: ఆధునిక జీవనశైలిలో భాగంగా ప్రస్తుతం చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు థైరాయిడ్ సమస్య బారిన కూడా పడుతున్నారు. ఈ సమస్య వల్ల పురుషుల కంటే స్త్రీల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ అనేది ఒక రకమైన హార్మోన్ సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి సరైన క్రమంలో ఔషధాలతోపాటు సరైన పోషకాలు ఉన్న ఆహారాలు కూడా ఎంతో అవసరం. లేకపోతే థైరాయిడ్ సమస్య పెరిగిపోయి..హైపో థైరాయిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ హార్మోన్ల సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఔషధాలతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
థైరాయిడ్ ఉన్నవారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోండి:
సెలీనియం కలిగిన ఆహారాలు:
థైరాయిడ్ వ్యాధికి సెలీనియం చాలా ప్రభావం చూపుతుంది. శరీరంలోని తగిన పరిమాణంలో సెలీనియం ఉంటే.. అది T4, T3 హార్మోన్లను ఏర్పాటు చేసేందుకు సహాయపడుతుంది అంతేకాకుండా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధిని సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాకుండా థైరాయిడ్ గ్రంథాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కూడా రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ప్రతిరోజు సెలీనియం అధిక పరిమాణంలో ఉండే గింజలను తీసుకోవడం చాలా మంచిది.
జింక్:
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా జింక్ అధిక పరిమాణంలో లభించే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి కాబట్టి జింక్ అధికమవుతాదిలో ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా హార్మోన్లు కూడా నియంత్రణలో ఉంటాయి. దీంతోపాటు జుట్టు రాలే సమస్య కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి జింక్ అధికమవుతాదిలో లభించే గుమ్మడికాయ గింజలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ఎలక్ట్రోలైట్స్:
ఎలక్ట్రోలైట్స్ కలిగిన ఆహారాలు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి ప్రభావవంతంగా సహాయపడతాయి ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడతాయి అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే థైరాయిడ్ ను నియంత్రించేందుకు సహాయపడతాయి కాబట్టి ప్రతిరోజు పచ్చి కొబ్బరి తో పాటు అందులోని నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
పసుపు:
థైరాయిడ్ తో బాధపడే వారికి పసుపు కూడా ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించేందుకు సహాయపడతాయి అంతేకాకుండా కాలయాన్ని డిటాక్సై చేసేందుకు ప్రభావవంతంగా పనిచేస్తాయి కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారాల్లో పసుపుని తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter